Thursday, November 14, 2024

వైసీపీ సభ్యుల వాకౌట్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విజయనగరం జిల్లా గుర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన డయేరియా మరణాలపై తెలుగుదేశం కూటమి సభ్యలు, వైఎస్సార్ సిపి సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మరణాలు సంభవించాయి? చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంతగా డయేరియా ప్రబలిందని బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కంటే ఈ ఐదు నెలల కాలంలో ఎందుకు తాగు నీటి వ్యవస్థలను మెయింటెన్ చేయలేకపోయారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బొత్స వ్యాఖ్యలకు ప్రతిగా మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్ళలో పంచాయితీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. డయేరియా భాదితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూనే నియోజకవర్గంలో పరిస్థితులపై బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
బొత్స సత్యనారాయణ ప్రాతినిత్యం వహించిన నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయనే చెప్పారని మంత్రి సత్య కుమార్ వ్యాఖ్యానించారు. బొత్స ఆవేదన చూస్తుంటే ముచ్చటేస్తుందని మంత్రి సత్య కుమార్ అన్నారు. సత్యకుమార్ పైశాచిక ఆనందం పొందుతున్నారని బొత్స పేర్కొన్నారు. బొత్స ఆవేదన పైనే తానే స్పందించానని ఆ వ్యాఖ్యల్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటానని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వివాదం నడిచింది. ఆ తరువాత వైసీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular