నిబంధనలు పాటించని 10 పబ్బులు సీజ్

122
10 Illegal pubs were seized in hyderabad
GHMC seized 15 Pubs for not following Rules

10 Illegal pubs were seized in hyderabad

హైదరాబాదులోని పబ్ ల తీరు ఏ మాత్రం మారటం లేదు . ఎన్ని సార్లు అధికారులు సీజ్ చేసినా నిబంధనలను పాటించటం లేదు . సిటీలో కల్చర్ గబ్బు లేపుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బులు యువతను పెడదారిన పట్టిస్తూ ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలోనే ఉంది .ఇప్పటికే సరైన అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పబ్ లు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని పబ్ లపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపారు.

హైదరాబాదులోని పలు పబ్ లపై ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు నియమ నిబంధనలను పాటించని పబ్ లను సీజ్ చేశారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఉన్న అన్ని పబ్‌ లపై దాడులు చేసిన అధికారులు, అగ్నిమాపక ఏర్పాట్లు, వ్యాపార అనుమతి లేని పది పబ్‌ లను సీజ్ చేశారు. అంతే కాదు ఇళ్ళ మధ్య లిక్కర్ బిజినెస్ చేయడానికి అనుమతి లేకున్నా చాలా పబ్బులు లిక్కర్ బిజినెస్ చేస్తున్నట్లుగా గుర్తించారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో మొత్తం 48 పబ్ లు ఉన్నాయని నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేశామని ఖైరతాబాద్‌ జోన్‌ కమిషనర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ మీడియాకు వెల్లడించారు.
ఇక వాటిల్లో కేవలం 12 మాత్రమే నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయని, మిగతా పబ్బులు నిబంధనలు పాటించడం లేదని ఆయన తెలిపారు. అందుకే ఆకస్మిక తనిఖీలు చేపట్టామని నిబంధనలు పాటించని మరో 26 పబ్ లకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. పబ్బుల యాజమాన్యం తమ వ్యవహార శైలి మార్చుకోకుంటే, నిబంధనలు పాటించకుంటే, దశలవారీగా వాటిని కూడా సీజ్ చేస్తామని అధికారులు .ఈతరహా హెచ్చరికలు చేసినా, ఇప్పటికే పలుమార్లు సీజ్ చేసినా సరే పబ్ ల నిర్వాహకులు మాత్రం మళ్ళీ అదే పంధా కొనసాగిస్తున్నారు. నిబంధనలకు నీళ్ళు వదిలేస్తున్నారు.

AMAZING FACTS

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here