10 లక్షల మందికి టీకా

In Telangana, Out Of 4 crore Population, There are 92 lakhs people above 45+ age. In these, nearly ten lakhs people took covid two doses, told by minister ktr today.

140
10 lakhs took covid two doses
10 lakhs took covid two doses
  • మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షల మంది దాకా ఉన్నారు. ఇందులో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు. వీరిలో 7.15 లక్షల మందితో పాటు 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకోగా.. మొత్తంగా 10 లక్షలకు పైగా జనాభా పూర్తి వాక్సిన్ తీసుకున్నారు. వాక్సిన్ ప్రజలకు అందించెందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను ప్రారంభించింది. రానున్న రోజుల్లో కరోనాకి చికిత్సకు అవసరమైన మందుల తయారీ దారులతో పాటు… వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం అవుతామని మంత్ర కేటీఆర్ తెలిపారు.
• ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకు కైనా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో మంచి పరిస్థితి ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల సత్ఫలితాలను ఇస్తున్నాయని ప్రభుత్వ చర్యల్ని కేంద్రం కూడా గుర్తించిందని.. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి తెలంగాణను అభినందించారని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here