అక్టోబ‌రు 14 నుంచి హండ్రెడ్ ప‌ర్సంట్ ఆక్యుపెన్సీ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అక్టోబ‌రు 14నుంచి హండ్రెడ్ ప‌ర్సంట్ ఆక్యుపెన్సీని ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. ఇది నిజ‌మైతే నిర్మాత‌లు ఆర్థికంగా తేరుకునే అవ‌కాశం ఉంటుంది. ద‌స‌రా సంద‌ర్భంగా పెద్ద సినిమాలు విడుద‌ల అవుతుండ‌టం వ‌ల్ల క‌లెక్ష‌న్లు భారీగా పెరుగుతాయి. అక్కినేని అఖిల్ న‌టిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, మ‌హాస‌ముద్రం వంటి ప‌లు బ‌డా సినిమాలు విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ఇదే క్ర‌మంలో అక్టోబ‌రు 22న అస‌లేం జ‌రిగింది? అనే థ్రిల్ల‌ర్ సినిమాను విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. కొత్త జాన‌ర్‌లో నిర్మించిన ఈ సినిమా అనుకున్న దానికంటే మెరుగ్గా వ‌చ్చింద‌ని చిత్ర బృందం సంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. అందుకే, ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి, ఆంధ్రప్ర‌దేశ్‌లో హండ్రెడ్ ప‌ర్సంట్ ఆక్యుపెన్సీని అనుమ‌తినిస్తే సినిమా ప‌రిశ్ర‌మ‌కు మ‌ళ్లీ పూర్వ వైభ‌వం వ‌చ్చిన‌ట్లు అవుతుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article