100% ఆక్యుపెన్సీ నిర్ణ‌యం ముందే తెలుసా?

180

ద‌స‌రా కంటే ముందు వ‌ర‌కూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేవ‌లం మూడు షోలు న‌డిసేవి. పైగా, ఫిఫ్టీ ప‌ర్సంట్ ఆక్యుపెన్సీ మాత్ర‌మే అనుమ‌తి ఉంది. ద‌స‌రా నుంచి నాలుగు షోలు, హండ్రెడ్ ప‌ర్సంట్ ఆక్యుపెన్సీని ప్ర‌భుత్వం అనుమ‌తించ‌డంతో మూడు బ‌డా సినిమాల‌కు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ప్ర‌భుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణ‌యం చిన్న సినిమాల‌కు వ‌రంగా మారే అవ‌కాశ‌ముంది. దస‌రా రేసులో చిన్న సినిమాలు పెద్ద‌గా లేన‌ప్ప‌టికీ, ఆత‌ర్వాతి వారంలో వ‌చ్చే వాటికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌ల‌కు ప్ర‌క‌టించిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. అక్టోబ‌రు 22న రిలీజ్ అయ్యే సినిమాల్లో నాట్యం, అస‌లేం జ‌రిగింది? వంటివి ఉన్నాయి. నాట్యం సినిమా క్లాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డానికి స్కోప్ ఉంది. అస‌లేం జ‌రిగింది సినిమా పూర్తిగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఎక్సోడ‌స్ మీడియా నిర్మించింది. ఈ సినిమా కాన్సెప్టు, న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్‌, మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ప్ర‌తిఒక్క‌రినీ ఆక‌ట్టుకునేలా ఉండ‌టం ప్రేక్ష‌కుల్ని థ్రిల్‌కు గురి చేసే అవ‌కాశ‌ముంద‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. అందుకే, హండ్రెడ్ ప‌ర్సంట్ క‌లెక్ష‌న్లు, నాలుగు షోల‌కు అనుమ‌తి వంటివి ఈ సినిమాకు క‌లిసొస్తుంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here