12 జిల్లాల కలెక్టరేట్లు వారంలో పూర్తి

65

సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో కలెక్టరేట్ కాంప్లెక్సెస్ నిర్మాణాల పూర్తి, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణికి సంబంధించిన విషయాలపై బిఆర్ కెఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 12 జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్సును వారంలోగా పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మిగతా జిల్లాలో కలెక్టర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణంకోసం టీఎస్ఐఐసీ కి భూములు హ్యాండ్ ఓవర్ చేసేలా చర్యలు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం ఇటీవల ఏడు జిల్లాలలో మంజూరు చేసిన నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం గుర్తించిన భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్లను సి.యస్ ఆదేశించారు.

ధరణిలో పెండింగ్ మ్యూటేషన్లు, భూవిషయాలకు సంబంధించిన గ్రీవియన్స్ మాడ్యూల్, ప్రొహిబిటరి ప్రాపర్టీలలో సమర్పించిన ధరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించి, జూన్ 9 లోగా పరిష్కరించి తద్వారా ఆ రైతులు రైతుబంధు సహాయం పొందేలా చూడాలని ఆదేశించారు. స్పెషల్ ట్రిబ్యునల్ లో పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్ లను నిర్వహించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here