- మూడేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్న 48 ఏళ్ల వ్యక్తి
మారథాన్ శస్త్రచికిత్సతో ప్రాణాలు కాపాడిన వైద్యులు
హైదరాబాద్, సెప్టెంబర్ 16, 2021: నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఒకటైన ఎస్ఎల్జీ ఆసుపత్రి వైద్యులు 12 గంటల పాటు మారథాన్ శస్త్రచికిత్స చేసి, దాదాపు మూడేళ్లుగా దీర్ఘకాల గుండె సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ప్రాణాలు కాపాడారు. “తకయాసూస్ ఆర్టెరైటిస్” అనే ఈ సమస్య సాధారణంగా యువతులలో కనిపిస్తుంది. కానీ, పదిమందిలో ఒకరికి మాత్రం పురుషుల్లోనూ అరుదుగా వస్తుంది.
సిద్దిపేట జిల్లాకు చెందిన బి.వెంకటేశం ఆగస్టు 14న ఎస్ఎల్జీ ఆసుపత్రిలో చేరారు. గత మూడేళ్లుగా ఆయన ఎన్నో ఆసుపత్రులు తిరిగినా, సమస్యకు పూర్తి పరిష్కారం దొరకలేదు. తయకాసూస్ ఆర్టెరైటిస్లో గుండె నుంచి శరీరభాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే బృహద్ధమని, ఇతర ధమనులు వాచి, పాడవుతాయి. కొంతవరకు కార్టియోస్టెరాయిడ్స్తో ఉపశమనం కలిగిస్తారు గానీ, అవి అందరికీ పూర్తిగా పనికిరావు.
వెంకటేశం చికిత్సపై ఎస్ఎల్జీ ఆసుపత్రి కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ వివేక్బాబు బొజ్జావర్ మాట్లాడుతూ, “ఆసుపత్రిలోని ఐసీయూలో చేరేసరికి ఈ పేషెంట్‌కు రక్తపోటు తగ్గడంలేదు. సీటీ స్కాన్ తీస్తే అతడి బృహద్ధమనిలో కొంతభాగం పాడైందని తెలిసింది. ఈ సమస్య పరిష్కారానికి అంటుకట్టడం ఒక్కటే మార్గం. శస్త్రచికిత్స బాగా సంక్లిష్టం కావడంతో, రోగి శరీరాన్ని 18 డిగ్రీల స్థాయికి చల్లబరిచి, రక్తప్రసరణను తగ్గించాం.”
“శస్త్రచికిత్స అనంతరం రోగిని వారంరోజుల పాటు పరిశీలనలో ఉంచి, ఆగస్టు 26న డిశ్చార్జి చేశాం. గతంలో రోగి పరిస్థితి సున్నితంగా ఉండటం, చేసిన శస్త్రచికిత్స సంక్లిష్టం కావడంతో, భవిష్యత్తులోనూ అతడిని కన్సల్టేషన్‌కు రావాలని చెప్పాం. ఇప్పుడు వెంకటేశం ఆరోగ్యం బాగా మెరుగుపడి, తన రోజువారీ పనులు చేసుకుంటున్నాడు” అని డాక్టర్ వివేక్బాబు బొజ్జావర్ తెలిపారు. ఈ చికిత్సలో ఇంకా కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డాక్టర్ భానుకిరణ్ రెడ్డి, ఐసీయూ అధిపతి డాక్టర్ సుహాసిని తిరుమల, కన్సల్టెంట్ కార్డియాక్ అనెస్థెటిస్ట్ డాక్టర్ అమర్ పాల్గొన్నారు.
తకయాసూస్ ఆర్టెరైటిస్ అనేది చాలా అరుదైన సమస్య. ఇందులో బృహద్ధమనితో పాటు మధ్యస్థాయి రక్తనాళాలూ దెబ్బతింటాయి. గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లే బృహద్ధమనికి అనుబంధంగా ఉండే చిన్న రక్తనాళాలు ఎక్కువ దెబ్బతింటాయి. చేతులకు, మెడ మీదుగా మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లేవి కూడా బాగా దెబ్బతింటాయి. బృహద్ధమని వాపు వల్ల ఇతర రక్తనాళాలు బలహీనపడి సాగుతాయి. ఫలితంగా రక్తనాళాల ఉబ్బు సమస్య వస్తుంది. కొన్ని సందర్బాల్లో రక్తనాళాలు సన్నబడి, పూర్తిగా బ్లాక్ అవుతాయి. (దీన్ని అక్లూజన్- దారి మూయడం అంటారు.