14 గంటలు ఆర్టీజీఎస్ బంద్

ఆర్టీజీఎస్ సేవలు దాదాపు పద్నాలు గంటల సేపు నిలిచిపోతాయని ఆర్బీఐ ప్రకటించింది.

91
14 HOURS HALT TO RTGS SERVICES
14 HOURS HALT TO RTGS SERVICES

ఏప్రిల్ 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఏప్రిల్ 18 మధ్యాహ్నం 2 గంటల వరకు 14 గంటలపాటు తాత్కాలికంగా RTGS సేవలు నిలిచిపోనున్నాయని ఆర్​బీఐ ప్రకటించింది. తక్షణ నగదు బదిలీ వ్యవస్థ ‘రియల్​ టైమ్ గ్రాస్ సెటిల్​మెంట్’ (ఆర్​టీజీఎస్) సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్​బీఐ ప్రకటించింది. ఈ శనివారం (ఏప్రిల్ 17) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం 2 గంటల వరకు.. 14 గంటలపాటు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది. ఆర్​టీజీఎస్​ వ్యవస్థ అప్​గ్రేడ్​ వల్ల ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు వివరించింది. ముఖ్యంగా డిజాస్టర్‌ రికవరీ టైమ్‌ను అప్​గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది.ఆర్‌టీజీఎస్‌ సేవలకు అంతరాయం ఏర్పడినా.. నెఫ్ట్​ సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది ఆర్​బీఐ.2020 డిసెంబర్​ 14 నుంచి ఆర్​టీజీఎస్​ సేవలు 24×7 అందుబాటులోకి వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here