14 గంట‌ల మేక‌ప్‌

14 hours Makeup
`స‌వ్య‌సాచి` త‌ర్వాత యాక్ట‌ర్ మాధ‌వ‌న్ ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో సైంటిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. `రాకెట్రీ:  ది నంబీ ఎఫెక్ట్‌` పేరుతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం మాధ‌వ‌న్ ఏకంగా 14 గంట‌ల పాటు మేక‌ప్‌తో అలాగే కుర్చీలో కూర్చుండిపోయార‌ట‌. ఈ విష‌యాన్ని మాధ‌వ‌న్ తెలియ‌జేశారు. ఈ వేస‌విలో సినిమా విడుద‌ల కానుంది. మార్స్ గ్ర‌హంపై వెళ్ల‌డానికి ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చేసిన కృషిని అందులో నంబి నారాయ‌ణ‌న్ పాత్ర‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. అనంత్ మ‌హ‌దేవన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు మాధ‌వ‌న్ సైలెన్స్ అనే చిత్రంలో అనుష్క‌తో క‌లిసి న‌టించ‌బోతున్నారు. 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article