1,472 IAS, 864 IPS పోస్టులు ఖాళీ

వివిధ రాష్ట్రాల్లో ఈ ఏడాది జనవరి నాటికి 1,472 ఐఏఎస్, 864 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.

అధికారుల కొరతను అధిగమించేందుకు బస్వాన్ కమిటీ సిఫారసులను అమలుచేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా సివిల్స్ ద్వారా ఏటా ఎంపిక చేసుకునే IPSల సంఖ్యను 200కి, IASల సంఖ్యను 180కి పెంచామని పేర్కొన్నారు. అంతకు మించి తీసుకుంటే నాణ్యతతో రాజీపడినట్లు అవుతుందని కమిటీ చెప్పిందన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article