1950 ఎన్టీఆర్ ’ఇంటిగుట్టు’ ఎత్తేసిన త్రివిక్రమ్?

‘ALA..’ 1950 NTR INTIGUTTU STORY?

త్రివిక్రమ్ శ్రీనివాస్ .. మాటల రచయితగా తెలుగు సినిమా పరిశ్రమలో ఫేమ్ అయ్యాడు. తర్వాత దర్శకుడుగా మారి నువ్వే నువ్వేతో తన రైటప్పే హైలెట్ గా ఆకట్టుకున్నాడు. అటుపై మాటలు రాస్తూనే దర్శకత్వం చేశాడు. కొన్నాళ్లయ్యాక తన సినిమాలకు మాత్రమే రాసుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకూ అతను చేసిన సినిమాలు చూస్తే ఏ ఒక్క సినిమాలో కూడా అతను క్రియేట్ చేసిన కథ కనిపించదు. పాత తెలుగు సినిమాల్లోని కంటెంట్ నే తనకు అనుకూలంగా మార్చుకుని తనకు బాగా తెలిసిన మాటలతో మాయ చేస్తూ వస్తున్నాడు. ఈ మాయలు ఇన్నాళ్లూ బానే పనిచేశాయి.

అజ్ఞాతవాసితో ఒక్కసారిగా డిజాస్టర్ చూశాడు. తర్వాత అరవింద సమేత వీరరాఘవ కూడా రాయలసీమ ప్రాంతంలో ఓ వ్యక్తి రాసిన ‘మొండికత్తి’కథ ఆధారంగానే అది కూడా కాపీ కొట్టి తీశాడు అనే విమర్శలు మూటగట్టుకున్నాడు. అంతకు ముందు అ ఆ మీనా సినిమా కాస్త రీమేక్, దానికి ముందు అతడు, వారసుడొచ్చాడు నుంచి మెయిన్ ప్లాట్ ఎత్తేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కాపీ కనిపిస్తుంది. దాన్ని బట్టే త్రివిక్రమ్ మంచి మాటగాడే కానీ కథకుడు కాదు అనుకోవచ్చు. ఇక ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరోసారి ఈ కాపీ క్యాట్ గానే కనిపించాడు. 1950స్ లో వచ్చిన ఎన్టీఆర్ ‘ఇంటిగుట్టు’ సినిమానే లేపేశాడు. అంటే కాపీ. పోనీ అదేమన్నా ప్రతిభావంతంగా చెప్పాడా అంటే అదీ లేదు. ఆ కాలపు స్క్రీన్ ప్లే తోనే వచ్చాడు.

నిజానికి ఈ సినిమా ఆరంభమే త్రివిక్రమ్ భావదారిద్య్రాన్ని చూపిస్తుంది. ప్రతి దశాబ్ధంలోనూ ఇదే పాయింట్ ఎన్నో కథలు వచ్చాయి. ఊహకు కూడా అందని సంపన్నుడి భార్య, ఓ మిడిల్ క్లాస్ వాడి భార్య ఒకే హాస్పిటల్ లో కాన్పుకు రావడం, ఒకరు కింద అంతస్తులో, మరొకరు పై అంతస్తులో డెలివరీ కావడం.. ఆ సమయంలో ఆ రెండు కుంటుంబాల్లోని ఏ వ్యక్తీ లేకపోవడం .. అనేవి అత్యంత సిల్లీ పాయింట్స్ .. కోమాలోకి వెళ్లిన నర్స్ పాతికేళ్లుగా బ్రతికి ఉండటం.. తన కథ అవసరం తీరాక చావడం.. ఇవన్నీ ఎప్పటి సినిమాలు. అత్తారింటికి దారేదీనే తండ్రిగారింటికి దారేదీ అనే తరహాలో మలిచి చేసిన ఈ ప్రహసనం నవ్వుల పాలవుతోంది. అంతేకాక.. తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలే కాదు.. అత్తలు, అమ్మలు పాత్రలు స్ట్రాంగ్ అని చెప్పుకునే త్రివిక్రమ్ కేవలం హీరోయిన్ తొడలపైనే 20 నిమిషాల పాటు ఫోకస్ చేయడం అతని చపలత్వాన్ని సూచిస్తుంది.

మిడిల్ క్లాస్ పీపుల్ అతను చూసిన, చూపించిన విధానం నిజమే అయితే అతనికి మించిన హేయమైన ఆలోచనా పరుడు ఉండదు.  ఒక్క సన్నివేశం కూడా కొత్తగా ఉంది అనిపించదు. హాస్యం కాస్తా అపహాస్యం అయింది. సునిల్ తన మిత్రుడు కావడం వల్లే నిర్మాతలను ముంచేస్తున్నాడు. క్లైమాక్స్ వెరైటీగా ఉంటుందనిపించినా.. అత్యంత బలహీనమైన విలనీ ప్రధాన లోపం కదా.. ? మొత్తంగా ఏ మాత్రం కొత్తదనం లేకపోయినా.. సంక్రాంతి పండగకు కుటంబ బంధాలను చెప్పిన సినిమా అంటున్నారు కానీ.. అందులోనూ అనేక డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. ఏదేమైనా త్రివిక్రమ్ లో అయిపోయిన పసకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ అల వైకుంఠపురములో. ఇలాంటి సినిమాతో మేం సాధించాం అని చెప్పుకుంటే అంతకు మించిన సృజనాత్మక దారిద్ర్యం లేదు..

Silly Points In Ala Vaikuntapuramloo,Minus Points,Trivikram Copy Movie,Whats Is Minus In Ala,Director Trivikram Dialogues,Negative On Ala Vaikuntapuramloo

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article