తెలంగాణకు 2.15 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు

రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ మెడిసిన్ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. వివిధ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు చేసినట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. రెమ్‌డెసివిర్ మెడిసిన్ ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రాలకు కేటాయింపుల్ని పెంచినట్లు తెలిపారు. 21 ఏప్రిల్ నుంచి 23 మే వరకు రాష్ట్రాలకు 76 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి 2,15,000 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కేటాయించినట్లు తెలిసింది. అంటే, రోజుకు దాదాపు 6500 రెమ్ డెసివర్ ఇంజక్షన్లు కేటాయించారన్నమాట. మరి, తెలంగాణ రాష్ట్రంలో నేటికీ 4.74 లక్షల యాక్టివ్ కొవిడ్ కేసులున్నాయి. మరి, రోజుకు కేవలం 6500 ఇంజక్షన్లు కేటాయించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పొచ్చు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article