Sunday, September 29, 2024

తెలంగాణలో వారికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ

* తెలంగాణలో వారికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ
* రుణమాఫీపై వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు
ఎన్నికల్లో ఇచ్చన మాట మేరకు ఆగష్టు 15 లోపు రైతులుకు సంబందించిన 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఐతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా బేషరతుగా పంట రుణాలు తీసుకున్న వారందరికి రుణమాఫీ చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్న చర్చ జరుగుతోంది. కేవలం అర్హులైన వారికి మాత్రమే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పట్టాదారు పాస్‌బుక్‌లు, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుని రుణమాఫీ చేయాలని వ్యవసాయ శాఖ  ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఐటీ చెల్లిస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులను రుణమాఫీ నుంచి మిగహాయించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
మరైవైపు 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు అధికారులు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా ప్రభుత్వానికి చేరనుంది. ఈ క్రమంలో రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపానలు పంపింది. రాష్ట్రంలో 2 లక్షల లోపు రుణాలు పొందినవారు సుమారు 60 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐతే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రుణాలు తీసున్నా.. అందరికి రేషన్ కార్డులు లేవు. కేవలం కుటుంబ పెద్దకు మాత్రమే రేషన్ కార్టు ఉండటంతో.. రేషన్‌ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇలా రేషన్ కార్డు నిబంధనను పాటిస్తే సుమారు 18 లక్షల మంది లబ్దిదారులు తగ్గే అవకాశం ఉందట.
మరోవైపు ఐటీ చెల్లిస్తున్నావారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులను మినహాయిస్తే మరో 2 లక్షల మంది లబ్దిదారులు తగ్గుతారని అంచనా వేస్తున్నారు. ఇలా పాస్‌ బుక్, రేషన్‌ కార్డు, ఐటీ చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనల వల్ల సుమారు 20 లక్షల మేర లబ్దిదారులు తగ్గి 40 లక్షల మంది మేరకే రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తారని సమాచారం. ఫైనల్ గా ఒకట్రెండు రోజుల్లో రుణమాఫీపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంగి రేవంత్ సర్కార్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular