రేపిస్టుకు 20 ఏళ్ల జైలు

నాంపల్లి ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ బాలికను రేప్ చేసిన నిందితుడికి 20 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. 3 నెలలోనే విచారణ పూర్తి.

  • నాంపల్లి ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు
  • బాలికపై అత్యాచార కేసులో శిక్ష ఖరారు
  • 3 నెలలోనే విచారణ పూర్తి

అన్నెం పున్నెం ఎరుగని ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు, రూ.పదివేల జరిమానా విధించింది. మంగళహాట్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. 8-10-2020న గుడియా యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వారి సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుండీ బ్రతుకు దెరువు కోసం భర్త అజయ్ కుమార్ యాదవ్ తో హైదరాబాద్ వచ్చారు. మంగల్ హాట్ లో వీళ్ళు ఉండే శివలాల్ నగర్ , ఉప్పర్ దూల్ పేట్ కాలనీలో ఉండే శుక్రత్ సింగ్ ఊకె అనే వ్యక్తిఐదేళ్ల తన పాపను ఆయన గదికి తీసుకెళ్లి ఐదు రూపాయలిచ్చి పాప బట్టలు విప్పి కర్కశంగా చేసాడని పాప ఏడుస్తూ చెప్పిందని, అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన మంగళహాట్ సీఐ నిందితుడిపై పోక్సో చట్టం కింద 255/2020 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అనంతరం చార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గా జీ బాలిక తరుపున వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా సాగిన కేసు విచారణలో అందరు సాక్షులను విచారించిన నాంపల్లి ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కుంచల సునీత నిందితుడికి ఇరవై యేండ్ల జైలు శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఒకవేళ రూ. పదివేల జరిమానా కట్టకపోతే మరో ఆరునెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. ఆదే విధంగా నిందితుడు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

SourceTSNEWS
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article