ఒక్క రోజులో 2 వేల కేసులు

2000 cases in T State

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంటల్లో దాదాపు రెండు వేలకు చేరువలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఐదుగురు మ‌ర‌ణించ‌గా 11వేలకు పైగా ఆక్టివ్ కేసులున్న‌ట్లు వైద్య శాఖ ప్ర‌క‌టించింది. జీహెచ్ఎంసీ 393, మేడ్చెల్ 205, నిజామాబాద్ 179, రంగారెడ్డి 169, నిర్మల్ 104 కేసులు న‌మోద‌య్యాయి. పైగా, క‌రోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయ్యింది. వైద్యశాఖ పనితీరు పై రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

దేశంలో 1.15 ల‌క్ష‌ల కేసులు
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 630 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 1,28,01,785 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ప్రస్తుతం 8,43,473 మందికి చికిత్స కొన‌సాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 1,17,92,135 మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 1,66,177 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న 59,856 మంది బాధితులు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 92.11%, మరణాల రేటు 1.30%గా కేంద్రం ప్ర‌క‌టించింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article