వృషభరాశి : ఈవారంలో వేచిచూసే ధోరణి మంచిది. అవతలివారినుండి మీపై ఆరంబంలో ఒత్తిడి లేదా ఇబ్బంది సూచిస్తున్నాయి, కాకపోతే నిదానంగా వ్యవహరించుట వలన తప్పక మీకే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు కాస్త నిదానంగా ముందుకు సాగుతాయి, గాబరా చెందకండి. ముఖ్యమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట సూచన. మిత్రులతో లేక ఆత్మీయులతో సమయాన్ని గడుపుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.
మిథునరాశి: ఈవారంలో మిత్రులతో కలిసి ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. బంధువులలో మంచి పేరును కలిగి ఉంటారు. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతనం ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే తడబాటుకు లోనయ్యే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి సానుకూల ఫలితాలు వస్తాయి.
కర్కాటకరాశి : ఈవారంలోఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద అవసరం. సమయానికి భోజనం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. సాధ్యమైనంత మేర చర్చాపరమైన విషయాల్లో పాల్గొనేముందు ఓపిక అవసరం. కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం వలన లబ్దిని పొందుతారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు సూచితం, అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపార పరమైన విషయాల్లో బాగానే ఉన్న తగిన స్థాయిలో ఆదాయం ఉండకపోవచ్చును. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. సంతానం నుండి ఆశించిన సహకారం లభిస్తుంది.
సింహరాశి : ఈవారంలోసమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఇవ్వండి. శుభకార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు నూతన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువులను కలుసుకుంటారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు ఆస్కారం కలదు. ఆత్మీయులలో ఒకరి ఆరోగ్యం విషయం మిమ్మల్ని కొంతమేర ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. విలువైన వసువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో బదిలీకి ఆస్కారం ఉంది, మీ ఆలోచనలను అధికారులతో పంచుకుంటారు. సంతానంతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు.
కన్యారాశి : ఈవారంలో సోదరులతో చర్చలు చేయుటకు అలాగే మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. చేపట్టిన పనుల విషయాల్లో స్పష్టత ఉండుట వలన లబ్దిని పొందుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి ఆశించిన మేర ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో బాగాఉంటుంది, అధికారులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. జీవితభాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి, అలాగే ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తగిన విశ్రాంతి అవసరం, సమయానికి భోజనం తీసుకోండి.
తులారాశి: ఈవారంలో మీ మాటతీరులో స్పష్టమైన మార్పులు వచ్చే ఆస్కారం ఉంది. గతకొంతకాలంగా మిమ్మల్ని దగ్గరినుండి చూసే వాళ్ళకి మీరు కొత్తగా కనిపిస్తారు. సోదరసమ్భన్దమైన విషయాల్లో సంతోషకరమైన వార్తను వింటారు. బంధువులనుండి సమాచారం వస్తుంది, మీలో మీరే కొంత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు, మానసిక ఆందోళన తప్పక పోవచ్చును. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన నష్టపోతారు. ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. రుణపరమైన విషయంలో కాస్త ఇబ్బందులు పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నూతన ఒప్పందాలు జరగక పోవచ్చును.
వృశ్చికరాశి : ఈవారంలో నూతన పనులను మొలలు పెట్టుటయందు తొందరపాటు పనికిరాదు. ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. సంతానంతో సమయాన్ని సరదాగా గడుపుతారు , సంతానం విషయంలో సంతోషకరమైన మార్పులు వస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. పెద్దలను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. సోదరుల నుండి సహకారం లభిస్తుంది. ఆత్మీయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.
ధనస్సురాశి: ఈవారంలో వ్యాపారసంభందమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారై సూచనల మేర ముందుకు వెళ్ళండి. సామజిక పరమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. నూతన ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. మిత్రులతో మనస్పర్థలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరమైన విషయాల్లో వచ్చిన సూచనలను మరొక సారి ఆలోచన చేయుట మంచిది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది లేదా వాహనాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును, జాగ్రత్త.
మకరరాశి : ఈవారంలో తండ్రితరుపు బందువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, అలాగే వారితో సమయం గడుపుతారు. గతమ్లో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ఎటువంటి సందేహాలు లేకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం చేత లబ్దిని పొందుతారు. భాగస్వామ్య ఒప్పందాల విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది. మిత్రులను కలుసుకుంటారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది.వ్యాపారంలో బాగానే ఉంటుంది, నూతన భాగస్వామ్య ఒప్పందాలకు ఆస్కారం కలదు. మానసికంగా దృడంగా ఉండుట సూచన. పెద్దలను కలుస్తారు, మీ ఆలోచనలను వారితో పంచుకుంటారు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు.
కుంభరాశి : ఈవారంలో కొంత త్వరగా కోపానికి గురయ్యే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం. మీ మాటతీరు వలన ఆత్మీయలను కోల్పోయే అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాల వలన నష్టపోతారు. నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టిన పనులకు ప్రధాన్యం ఇవ్వండి. సంతానం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు లేక మాటపట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది, అలాగే ఖర్చులు కూడా పెరుగుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును, వెంటనే వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి . ధనం కన్నా ఆత్మీయులు ఎక్కువ అని గుర్తిస్తారు.
మీనరాశి : ఈవారంలో కుటుంబంలో సభ్యుల మధ్య చర్చలకు అవకాశం ఉంది. వారై ఆలోచనలను తెలుసుకొనే ప్రయత్నం చేయండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. కోపాన్ని తగ్గించుకోండి, అందరిని కలుపుకొని వెళ్ళుట వలన పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారంలో బాగానే ఉంటుంది, నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. బంధువులను కలుస్తారు. అధికారుల నుండి ప్రశంశలు లభిస్తాయి. ఎదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వండి.