ఈ వారం వారఫలాలు

Spread the love

2019 September Third Week Horoscope

మేషరాశిఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి , పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను ఆత్మీయుల కోసం కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు. విదేశాల్లో ఉన్నవారు చేసే నూతనప్రయత్నాలు ముందుకు సాగుతాయి, ఆశించిన మేర ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్యక్రమాల విషయంలో చర్చలు జరుగుటకు అవకాశం ఉంది. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. సంతానం విషయంలో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది.

వృషభరాశిఈవారం మొత్తం మీద ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కుటుంబంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు వాయిదాపడుతాయి. ఉద్యోగంలో ఒకింత పనిఒత్తిడి ఉంటుంది. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. తండ్రితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు వారం చివరలో కలిసి వస్తాయి. సోదరులనుండి వచ్చే సూచనలు లేక విషయాలు మీలో కొత్త సందేహాలను తెచ్చే అవకాశం కలదు. చర్చాపరమైన విషయాల్లో పాల్గొంటారు. రుణపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు.
మిథునరాశి: ఈవారం మొత్తం మీద స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆత్మీయులను కలిసే ఆస్కారం ఉంది, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. కుటుంబంలో కీలకమయిన అంశాలపై చర్చలు జరుగుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో ఊహించని విధంగా మనస్పర్థలు రావడానికి ఆస్కారం కలదు. బంధువుల నుండి సమాచారం అందుతుంది.

కర్కాటకరాశి :ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగపడుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశాల్లో ఉన్నవారు అనుకోకుండా స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కలదు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. తండ్రితరుపు వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది.

సింహరాశి :ఈవారం మొత్తం మీద తండ్రితరుపు బంధువులను కలిసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విదేశాలలో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సాధ్యమైనంత మేర చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించడానికి చేసే ప్రయత్నాలు విఫలం అవుతారు. మీమాటతీరు మూలాన నూతన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆత్మీయుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.

కన్యారాశి :ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. బాగాఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను ముందుగా పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్న బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది, జాగ్రత్త. సంతానం నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు సమసి పోతాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. మిత్రులతో చర్చలకు అవకాశం కలదు.

తులారాశి: ఈవారం మొత్తం మీద మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, అందరిని కలుపుకొని వెళ్ళుట సూచన. పెద్దలతో మీకున్న పరిచయాన్ని ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న బంధువులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. దైవపరమయిన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది.
వృశ్చికరాశి : ఈవారం మొత్తం మీద ఆరోగ్యం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వలన కొంతమేర ఇబ్బందులు తప్పక పోవచ్చును. చర్చాపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందే అవకాశం కలదు. ప్రయాణాలు వాయిదాపడుతాయి. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.
ధనస్సురాశి: ఈవారం మొత్తం మీద మొదట్లో కొంత పనివత్తిడి అలాగే అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో సమయపాలన పాటించుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, చిన్న చిన్న అడ్డంకులు వచినప్పటికిని వాటిని అధిగమిస్తారు. మిత్రులను కలిసే అవకాశం ఉంది, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. నూతన ఉద్యోగప్రయత్నాలు చేసేవారికి అనుకూలమయిన సమయం. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, నూతన నిర్ణయాలకు అవకాశం కలదు.

మకరరాశి : ఈవారం మొత్తం మీద నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి, వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేయుటకు నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకపోవడం మంచిది. వివాహాం కానివారికి అనుకూలమైన సమయం, కొద్దిపాటి ప్రయత్నం వలన ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. రుణపరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభరాశి :ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, కుటుంబంలో మీ ఆలోచనలను కుటుంబసభ్యులకు తెలియజేస్తారు. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త శ్రద్దగా ఉండుట సూచన. ముందుగా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట సూచన. సాధ్యమైనంత మేర బద్ధకం వీడటం సూచన. జీవితభాగస్వామి సూచనలను పరిగణలోకి తీసుకోవడం మేలు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆత్మీయులను కలుస్తారు. తండ్రితరుపు బంధువులతో ఊహించని విధంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సర్దుబాటు విధానం తప్పక మేలుచేస్తుంది.

మీనరాశి :ఈవారం మొత్తం మీద బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. అనుకోకుండా చేసే ప్రయాణాలు లేదా ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. మీమాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. సంతానం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. కుటుంబంలో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి, మంచిది.

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
బి.టెక్ (మెకానికల్), ఎం.ఎ (జ్యోతిషం), ఎం.ఎ (వేదాంగ జ్యోతిషం) మాస్టర్స్ ఇన్ వాస్తు, పిజి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సంఖ్యా శాస్త్రం, పిహెచ్ డి (వేదాంగజ్యోతిషం), ఎమ్ఎస్సి (సైకాలజీ )
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *