ఫిబ్రవరి 2 – 8 తేదీ వారఫలాలు

2020 FEBRUARY FIRST WEEK HOROSCOPE

మేషరాశి :ఈవారం మొత్తం మీద బందువులతో సమయం గడుపుతారు, అధిక సమయం ప్రయాణాలకు ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన మేర నూతన పెట్టుబడులు లభిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. మీ మొండి తనం వలన కొంతమంది ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది, కాస్త ఈ విషయంలో ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సర్దుబాటు మంచిది.

వృషభరాశి :ఈవారం మొత్తం మీద ఆరంభంలో దూకుడు ఉన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి, మంచిది . చిన్న చిన్న ఇబబందులు ఎదురయ్యే అవకాశం ఉంది, తెలివితో వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు, వారినుండి పూర్తిస్థాయి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. దైవపారమైన విషయాలకు సమయం ఇస్తారు.
 
మిథునరాశి:ఈవారం మొత్తం మీద నూతన అవకాశాలు పొందుతారు, గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నా ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న అనుభందం కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబంలో సభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఆరోగ్యం చాలామేర కుదుటపడే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. మీ నిర్ణయాలు మీలో కొత్త ఆలోచనలకు మార్గం అవుతాయి. గతంలో కన్నా ముఖ్యమైన విషయాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చును.

కర్కాటకరాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. సాధ్యమైనంత మేర నూతన చర్చలకు అవకాశం ఇవ్వకండి. ఉద్యోగంలో అధికారుల నుండి సహకారం లభిస్తుంది, అలాగే వారినుండి అభినందనలు పొందుతారు. రావలిసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. బంధువులను కలుస్తారు, వారితో కలిసి నూతన ఆలోచనలు చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు అవకాశం ఇస్తాయి. జీవితభాగస్వామి నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. కుటుంబంలో పెద్దలనుండి నూతన విషయాలు తెలుస్తాయి. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.
 
సింహరాశి :ఈవారం మొత్తం మీద ఆరంభంలో చిన్న చిన్న విషయాలకే హైరానా చెందుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో వాయిదా ఆలోచన లేక వేచిచూసే ధోరణి మేలుచేస్తుంది. కుటుంబపరమైన విషయాల్లో మీ నిర్ణయాలు పెద్దలను లేదా కుటుంబసభ్యులను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలకు పెద్ద పీటవేస్తారు. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సముద్రతీరప్రాంతాలకు ప్రయాణం చేయుటకు అవకాశం ఉంది, విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

కన్యారాశి :ఈవారం మొత్తం మీద పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు , నిర్ణయాలను తీసుకోవడంలో తొందరపాటు వద్దు. కుటుంబంలో సభ్యులతో చర్చలు చేయునపుడు కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట సూచన. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం ఉంది, నిరాశ చెందకండి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆత్మేయుల ఆరోగ్యం మాత్రం మిమల్ని కాస్త ఆందోళనకు గురిచేసే ఆస్కారం ఉంది. సంతానం గురుంచి ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది, మార్పుకు ఆస్కారం ఉంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి, కాస్త స్పష్టమైన ఆలోచన అలాగే ప్రణాళిక అవసరం.
 
తులారాశి:ఈవారం మొత్తం మీద సంతాన పరమైన విషయాల గురుంచి ఎక్కువగా ఆలోచన చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టు పనుల విషయాల్లో స్పష్టత కలిగి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయంలో బాగానే ఉంటుంది, కాకపోతే ఆదాయానికి సరిపడ ఖర్చు ఉంటుంది. పెద్దలతో సాధ్యమైనంత మేర చర్చలు చేయకపోవడం సూచన. ఆర్థికపరమైన విషయంలో కూడా అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోండి. ఉద్యోగంలో తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది, కాస్త ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు.

వృశ్చికరాశి :ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట ద్వారా పెద్దలనుండి ప్రశంశలను పొందుటకు అవకాశం ఉంది కుటుంబంలో సభ్యుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, గత కొంతకాలంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. సోదరులతో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సంతాన పరమైన విషయంలో కాస్త ఒత్తిడి ఉంటుంది, ప్రణాళికతో ముందుకు వెళ్ళండి మేలుజరుగుతుంది.
ధనస్సురాశి:ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో నలుగురిలో గుర్తింపును పొందుతారు, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లాభ్సిస్తాయి. చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది, అనుకోకుండా ఏర్పడే స్వల్ప విభేదాలు మీపై అధికంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకపోవడం అవలం తప్పక మేలుజరుగుతుంది . వారం చివరలో మిత్రులనుండి ఆశించిన మేర సహకారం వస్తుంది. విదేశాల్లో ఉన్నవారు అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, నూతన పరిచయాలకు అవకాశం ఉంది.
 
మకరరాశి :ఈవారం మొత్తం మీద అధిక సమయం మీకు నచ్చిన విధంగా గడుపుటకు ఇష్టపడుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది , ఎవరికీ తొందరపడి మాట ఇవ్వకపోవడం సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి , సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. అలాగే ఆరోగ్య పరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.

కుంభరాశి :ఈవారం మొత్తం మీద స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో మధ్యలో ఆగిన ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం కాస్త ఓపిక అవసరం, ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త సమయం పడుతుంది. కుటుంబంలో మీ ఇష్టమైన వ్యక్తులనుండి పూర్తిగా అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. అనుకోకుండా కలిసే వ్యక్తుల వలన , ఊహించని మార్పుకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది, కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఇంకా మంచిది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది, పెద్దలను కలుస్తారు.

మీనరాశి :ఈవారం మొత్తం మీద సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, వారై అభిప్రయాలను తెలుసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు, ముందుగా గతంలో మీరు చేసుకున్న ఒప్పందాలను అమలు చేసే ప్రయత్నం చేయుట వలన తప్పక మేలుజరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు, ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానపరమైన విషయాల్లో పెద్దల సూచనల మేర నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో విదేశీయాన ప్రయాణ ప్రయత్నాలు చేసిన వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యం అయ్యే ఆస్కారం ఉంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article