ఏపీలో త్వరలో  25 జిల్లాలు

173
25 Districts In AP Soon
25 Districts In AP Soon

25 Districts In AP Soon

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్త జిల్లాల అంశం తెరమీదకు వచ్చింది. ఏపీలో త్వరలోనే 25 జిల్లాలుఏర్పాటు జరుగుతుందని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ పట్నంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం చేసిన ఈ వేడుకల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి అవంతి శ్రీనివాసరావు సహా వైసీపీ నేతలు కార్యకర్తలు పొల్గొన్నారు.   కేక్ కట్ చేసి జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు. ఏపీకి ఇప్పటికే మూడు రాజధానులు అవసరం అని సీఎం జగన్ ప్రకటన చెయ్యటం వెనుక అసలు రీజన్ ఇదే అని  విజయసాయిరెడ్డి కొనియాడారు. ప్రజలకు సేవ చేయడమే జగన్ సంకల్పమని పేర్కొన్న విజయసాయి రెడ్డి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జగన్ లక్ష్యం అని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. విశాఖను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చేసిన జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణతో అభివృద్ధి చేస్తుందని పేర్కొన్న విజయసాయి  ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలుగా చేస్తామని, అసలు మూడు రాజధానులు చెయ్యాలనే ఆలోచన వెనుక అంతరార్ధం అదేనని   వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

tags : Andhra Pradesh, AP, New Districts, YCP, MP, VijayasaiReddy, Jagan, JaganMohanReddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here