ఎల్లంకి చెరువులో పడిన కారు… ముగ్గురు మృతి  

3 died With Car Fell Into Ellanki Pond
ఇటీవల కాలంలో చెరువుల్లో, కాలువల్లో  కార్లు పడుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న కాకతీయ కెనాల్ లో కారు పడి  పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం జలసమాధి అయిన విషాదం మరువకముందే యాదాద్రి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామన్నపేట మండలం ఎల్లంకి చెరువులోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు సర్నెనిగూడెం సర్పంచ్‌ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్‌ శ్రీధర్‌రెడ్డిలుగా గుర్తించారు. సహాయక చర్యలను నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  పర్యవేక్షించారు. కారును స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బయటకు వెళ్లిన ఈ ముగ్గురు రాత్రి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో వెతికిన పోలీసులు.. విచారణలో భాగంగా ఎల్లంకి గ్రామంలోని సీసీటీవి ఫుటేజీని పరిశీలించారు. కారు చెరువు కట్టపై నుంచి వెళ్లినట్టు అందులో గుర్తించారు. దీంతో చెరువు వద్ద వెతకగా.. నీళ్లలో మునిగిపోయిన కారును గుర్తించారు. జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు .

3 died With Car Fell Into Ellanki Pond,yadadri district , ellanki tank , sarenni gudem surpanch , three members , died , car accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *