31 Cases Hasbeen Confirmed In India
డ్రాగన్ కంట్రీ అయిన చైనాలో పుట్టి పక్క దేశాలకు వ్యాపిస్తూ ఇప్పుడు ప్రపంచాన్నే భయపెడుతుంది కరోనా వైరస్ . ప్రస్తుతం 60కి పైగా దేశాలను వణికిస్తోన్న ఈ కరోనా వైరస్ భారత దేశంలోనూ వ్యాపిస్తుంది. భారతదేశంలో వందల సంఖ్యలో కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో ఉన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా వైరస్ పేరును కొవిడ్-19 వైరస్‌గా మార్చినా అందరికీ కరోనా అనగానే భయం మొదలవుతుంది. ఇక మన దేశంలో నిన్నా మొన్నటి దాకా ఎఫెక్ట్ లేదు అనుకున్న కరోనా వైరస్ భారత్‌లో బుధవారం నాటికి బాగానే వ్యాప్తి చెందింది . ఇక ఇటాలియన్ టూరిస్ట్ ల ద్వారా భారత్ లో పాగా వేసిన ఈ వైరస్ వల్ల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక తాజాగా భారత్‌లో మరో కరోనా కేసు నమోదయింది. ఈరోజు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన వ్యక్తి ఇటీవల మలేషియా , థాయిలాండ్ దేశాలలో పర్యటించినట్లు వైద్య శాఖాధికారులు ధ్రువీకరించారు . ప్రస్తుతం అతనికి ఢిల్లీలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31కి చేరింది. కాసేపట్లో అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అన్ని రాష్ట్రాల మంత్రులతో సమావేశంలో చర్చ జరపనున్నారు .