చైనాలో 32వేలకు పైగా కరోనా బాధితులు

32000 coronavirus victims in china

చైనాను  భయంకర కరోనా వణికిస్తుంది .. అడ్డూ, అదుపూ లేకుండా విజృంభిస్తోంది.  32 వేలకు పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ వ్యాధి బారిన పడి  మరణించినవారి సంఖ్య సుమారు 725 కు పెరిగింది..ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2002-2003 లో సార్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 770 మంది మృత్యువాత పడ్డారు. ఆ వ్యాధి లక్షణాలే కరోనాకు కారణమన్న వాదనను చైనా తోసిపుచ్చింది. వూహాన్ సిటీలోని సీఫుడ్ మార్కెట్ నుంచి ప్రారంభమైన కరోనాకు విరుగుడు వ్యాక్సీన్ ను కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నా.. వ్యాధి మాత్రం అనేకమందిని బలి తీసుకుంటోంది. యుఎస్, నేపాల్, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, తైవాన్, మలేసియా , వియత్నాం తదితర దేశాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో.. కేరళలో మూడు కేసులను నిర్ధారించారు. అయితే ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి నివారణ చర్యలను యుధ్ధ ప్రాతిపదికన చేబట్టిన దృష్ట్యా.. ఎలాంటి ఆందోళనా అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాగా-చైనాలోని ఆసుపత్రుల్లో కరోనా ఇన్ఫెక్షన్ సోకి హాస్పిటల్స్  సిబ్బంది కూడా అస్వస్థులవుతున్నారు. ఈ వ్యాధికారణంగా ఓ డాక్టర్ మరణించాడు. కరోనా సోకిన పేషంట్లకు ఇస్తున్న ఆహారాన్ని కూడా డాక్టర్లు మార్చేశారు. వారికి ఇప్పటివరకు చేపలతో తయారైన డైట్ ఇస్తుండగా.. దీని బదులు తాబేళ్ల మాంసంతో చేసిన డిష్ లను ఇస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి.

#CORONAVIRUSVICTIMS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article