నాలుగు సూత్రాలతో కరోనాకు అడ్డుకట్ట

98
EETALA ATTACKED CM KCR
EETALA ATTACKED CM KCR

4 tips to control corona

నాలుగు సూత్రాల్ని పాటిస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరం విధిగా వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అన్ని వేళలా మాస్క్ ధరించాలని కోరారు. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలన్నారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలన్నారు. అవసరం ఉంటే తప్ప ఇంటినుండి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. ఇబ్బంది ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరండి. నిర్లక్ష్యం చేసిన వారికి ప్రాణాపాయం ఉంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సలహాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కరోనా కట్టడికి, మరణాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ సహకరించండి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వానికి సహకరించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలు నిర్లక్ష్యం చేయవద్దు. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాల నుండి గ్రామాల్లోకి వచ్చే వారిపై దృష్టి పెట్టామన్నారు.

Telangana Corona Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here