47డేస్.. మరో డిజాస్టర్ అంటగా

47 days not impressed

థియేటర్స్ లేకపోవడం వల్ల చాలా సినిమాలు ప్రత్యామ్నాయంగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ ను సెలెక్ట్  చేసుకుంటున్నాయి. కానీ వీరి సెలెక్షన్ కంటే కంటెంటే ఇంపార్టెంట్ అనేది ఏ ఫార్మాట్ కైనా వర్తిస్తుంది. అది లేకపోవడం వల్లే ఇప్పటి వరకూ ఇండియాలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో విడుదలైన అన్ని సినిమాలు ఫ్లాప్ గానే నిలిచాయి. బాలీవుడ్ లో ఒకటీ రెండు సినిమాలకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. కానీ అంతగా ఆకట్టుకోలేదు. తెలుగులో కేవలం కృష్ణ అండ్ హిజ్ లీల మాత్రమే హిట్ అనిపించుకుంటే తమిళ్ లో వచ్చిన రెండు సినిమాలూ పోయాయి. మొత్తంగా ఈ వేదిక అవకాశం ఇస్తుందే తప్ప.. విజయాన్ని ఇవ్వదు అనేది తేలిపోయింది. అంటే హిట్ కావాలి అంటే కంటెంటే ప్రధానం. ఇక తాజాగా ఓటిటిలో విడుదలైన మరో సినిమా సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రధాన పాత్రల్లో నటించిన ‘47డేస్’. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన 47 డేస్.. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయిందనే టాక్ తెచ్చుకుంది. ఇలాంటి సినిమాల్లో ఉండాల్సిన బలమైన స్క్రీన్ ప్లే ప్రధాన బలహీనతగా.. ఏ మాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో వచ్చిన ఈ చిత్రం మరో డిజాస్టర్ గా నిలిచిపోయిందంటున్నారు.

నిజానికి ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. లాక్ డౌన్ అంటున్నారు కానీ.. ఇది పూర్తయిన టైమ్ కు విడుదలై ఉంటే లాక్ డౌన్ కంటే ఆరేడు నెలల ముందే విడుదలై ఉండొచ్చు. రకరకాల కారణాలతో ఆగిపోయిన 47డేస్.. కనీసం 40 మినిట్స్ కూడా చూడలేకపోయాం అంటున్నారు వీక్షకులు. సత్యదేవ్ పోలీస్ పాత్రలో నటించాడు. అతని భార్య సూసైడ్ చేసుకుంటుంది. అదే టైమ్ లో తను చేసిన ఓ మిస్టేక్ కారణంగా సస్పెండ్ అవుతాడు. అక్కడి నుంచి తన భార్య ఆత్మహత్యకు ఓ క్లూ దొరుకుతుంది. ఆ క్లూ పట్టుకుని కేస్ ను ఛేదించాలనుకుంటాడు. ఈ పాయింట్ చుట్టూ కాస్త బలమైన కథనం రాసుకుంటే ఆకట్టుకోవచ్చు. కానీ దర్శకుడు ఏ దశలోనూ ఈ వైపుగా ఆలోచించలేదేమో అంటున్నారు. కేవలం ట్విస్ట్ లను నమ్ముకున్నాడు. కానీ ఆ ట్విస్ట్ లను రివీల్ చేయడమే పెద్ద సవాల్ అన్నది మరిచిపోయాడంటున్నారు. మొత్తంగా కృష్ణ అండ్ హిజ్ లీల తర్వాత ఓటిటికి కాస్త ఊపొస్తుందేమో అనుకుంటే ఈ 47డేస్ వెంటనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది అంటున్నారు. సత్యదేవ్ అద్భుతంగా నటించిన దర్శకత్వ లోపంతో ఈ సినిమా మరో డిజాస్టర్ గా మిగిలిపోయినట్టే తేల్చేశారు.

OTT news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *