కేరళలో ఒకే కుటుంబంలో మరో ఐదు కేసులు

5 More Cases Of Coronavirus In Kerala

కరోనా ఎన్నో మందులు ఉన్నాయని , హోమియోపతిలో , ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయని రకరకాల పుకార్లు వ్యాప్తి చెందుతున్నా ఇప్పటికీ నిర్దిష్టమైన మందు మాత్రం ఏ దేశం ప్రకటించలేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రాకుండా, వ్యాప్తి చెందకుండా ఎలాంటి మందులు లేకపోవటంతో  ఆ దేవదేవుడే  కాపాడతారని పూజలు చేస్తున్న తీరు తెలంగాణా రాష్ట్రంలో కనిపిస్తుంది. నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తుంది. ఇక తాజాగా అందులో ఇండియా అందునా కేరళ రాష్ట్రం చేరింది . ఇక ఈ వైరస్ కరోనాపేరు వింటేనే కేరళ ప్రజలకే కాదు, ప్రభుత్వాలకు సైతం వెన్నులో వణుకుపుడుతోంది.

ప్రపంచాన్ని చుట్టేస్తూ.. ఇప్పటికే 60కి పైగా దేశాలకు విస్తరించింది. ఇక, భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది కరోనా వైరస్.. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ ఐదుగురు కేరళలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో, దేశంలో కరోనా వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య 39కి చేరుకుంది. ఆ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురితో పాటు మరో ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా ప్రకటించారు. ఆ కుటుంబంలో కరోనా బారిన పడిన వారిలో ఒక బాలుడు ఉండగా.. వారినందిరినీ ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు కేరళ సర్కార్ వెల్లడించింది.

5 More Cases Of Coronavirus In Kerala,corona virus, corona kerala, corona india , positive cases , health minister, kk shailaja , kerala government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *