13 నగరాల్లో 5జీ సేవలు

దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దిల్లీ ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌- 2022 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభంకానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. కాగా నేటి నుంచి ఈనెల 4వ తేదీ వరకు ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభిస్తుందని, కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని చెబుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article