`త‌లైవి`గా కంగ‌నా

Spread the love

Kananaga will Be like Thailava

క్వీన్‌, త‌ను వెడ్స్ మ‌ను చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కంగ‌నా ర‌నౌత్‌.. మ‌ణిక‌ర్ణిక‌తో న‌టిగానే కాదు, ద‌ర్శ‌కురాలిగా కూడా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుక‌న్నారు. ఈమె మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించ‌బోతున్నారు. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్త‌య్యాయి. అధికారిక స‌మాచారం మాత్రం మిగిలి ఉంది. ఇంత‌కు కంగ‌నా చేయ‌బోయే ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా `త‌లైవి`( నాయ‌కురాలు అని అర్థం). త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఇది. విబ్రి మీడియా బ్యాన‌ర్‌పై విష్ణు ఇందూరి నిర్మాత‌గా ఈ బ‌యోపిక్ రూపొందనుంది. ఇందులో జ‌య‌ల‌లిత‌గా ఎవ‌రిని న‌టింప చేయాల‌ని యూనిట్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతుంది. విద్యాబాల‌న్‌, సోనాక్షిసిన్హా, ఐశ్వ‌ర్య‌రాయ్ త‌దిత‌రుల పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. అయితే రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ సూచ‌న మేర‌కు ఈ లిస్టులో కంగ‌నా కూడా చేరింది. కంగనాకు ఇప్పుడు బాలీవుడ్‌లో పిచ్చ క్రేజ్ ఉంది. ఆమె యాట్యిట్యూడ్ పాత్ర‌కు ప‌క్కాగా స‌రిపోతుంద‌ని యూనిట్ వ‌ర్గాలు భావించి కంగనాను సంప్ర‌దించాయ‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *