తప్పిపోయిన బాలుడు.. 3 గంటల్లో!

కాకినాడలో సాంబమూర్తి నగర్ లో తప్పిపోయిన 6 ఏళ్ళు బాలుడుని జిల్లా ఎస్పీ చొరవతో మూడు గంటలు వ్యవధిలోనే పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సాంబమూర్తి నగర్ రెండో వీధికి చెందిన పెనుపోతు వెంకటేష్ అనే వ్యక్తి 100 కి కాల్ చేసి తన ఆరేళ్ల కుమారుడు రిత్విక్ వర్మ కనపడటలేదని ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు కలిసి కాకినాడలో వీధులన్నీ జల్లడ పట్టారు.

సాంబమూర్తినగర్ లో తప్పిపోయిన బాబుని కాకినాడ గాంధీ నగర్ ఎల్విన్ పేటలో బాబు ఆచూకీని పోలీసులు గుర్తించారు. కేవలం మూడు గంటల్లోనే బాబుని పట్టుకోగలగారు. జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బంది చేసిన కృషికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వారికెంతో రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులు వద్దకు చేర్చడంతో స్థానికులు పోలీసుల్నిఅభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article