అన్నం పెడతామని పిలిచి యాచాకురాలిపై అత్యాచారం

122
60-year-old beggar was raped
60-year-old beggar was raped

60-year-old beggar was raped by two persons

ఎన్ని చట్టాలు వచ్చినా, ఎందర్ని ఎన్కౌంటర్ చేసినా మృగాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నా అఘాయిత్యాలకు పాల్పడే నీచుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దిశ సంఘటనత తర్వాత మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే ఇవేమి పట్టించుకోని ఇద్దరు మృగాళ్లు వయస్సును మరిచి మద్యం మత్తులో ఏకంగా ఆరు పదుల వయస్సున్న వృద్దురాలిపై అఘాయిత్యం చేసిన దారుణ సంఘటన వెలుగు చూసింది.

నగరంలోని మిర్జాలగూడలో సంఘటన మద్యం మత్తులో యచకురాలు అన్న జాలి కూడా లేకుండా , యాచకురాలిపై ఇద్దరు మధ్య వయస్సు వ్యక్తులు అత్యాచారం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని లాలాపేట్‌కు చెంది, యాబై సంవత్సరాల వయస్సున్న జార్జ్ ,వికారాబాద్ జిల్లా స్టేషన్ థరూర్‌కి చెందిన విజయ్ కుమార్ ‌లు ఇద్దరు తమ భార్యలను వదిలివేసి, నగరంలోని మిర్జాలగూడలో కలిసి ఉంటున్నారు. కాగా నగంలోనే పెయింటింగ్ పనులు చేస్తూ…జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గత మంగళవారం రాత్రీ ఏడుగంటలకు సుమారు 60 సంవత్సరాలు ఉన్న ఓ యాచకురాలు అన్నం కోసం వారి ఇంటిముందుకు వచ్చింది. అయితే అప్పటికే మద్యం మత్తులో జోగుతున్న ఇద్దరి కన్ను యాచకురాలలిపై పడింది. దీంతో అన్నం పెడతామని ఇంటి ముందు ఉన్న యాచకురాలిని ఇంట్లోకి పిలిచారు. అనంతరం ముచ్చట్లలోకి దింపారు.. వారిని నమ్మిన యాచకురాలికి బలవంతంగా మద్యం తాగించారు. దీంతో ఆమె స్పృహ కోల్పోవడంతో… విచక్షణ కొల్పోయిన కామంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.  అయితే యాచకురాలిపై అత్యాచారం చేస్తున్న సమయంలో కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం 100కు డయల్ చేసి విషయాన్ని చెప్పారు. దీంతో బయపడిన నిందితులు అక్కడి నుండి పారిపోయారు. నాలుగు రోజులుగా తప్పించుకుని తిరుగుండడంతో పోలీసులు శనివారం మాటు వేసి మిర్జాలగూడలోని అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేశారు.
60-year-old beggar was raped by two persons,mirjalaguda , begger, old age woman , rape attempt , food , hyderabad,Two held for raping 60-year-old

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here