వెన్నెముక విరిగిన 60 ఏళ్ల వృద్ధురాలికి సంక్లిష్ట‌మైన చికిత్స

హైద‌రాబాద్, ఏప్రిల్ 4, 2022: వెన్నెముక కిందిభాగం విరిగిన 60 ఏళ్ల వృద్ధురాలికి న‌గ‌రంలోని ప్ర‌ధాన మ‌ల్టీస్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన సెంచురీ ఆస్ప‌త్రిలో వైద్యులు విజ‌య‌వంతంగా మినిమ‌ల్లీ ఇన్వేజివ్ న్యూరోస‌ర్జ‌రీ చేసి ఊర‌ట క‌ల్పించారు. డి12 వెర్టెబ్రా వ‌ద్ద ఫ్రాక్చ‌ర్ కావ‌డంతో, వైద్యులు వెర్టెబ్రోప్లాస్టీ అనే చికిత్స చేయాల్సి వ‌చ్చింది.

వెన్నెముక‌లో కంప్రెష‌న్ ఫ్రాక్చ‌ర్ల‌ను న‌యం చేయ‌డానికి చేసే చికిత్సే వెర్టెబ్రోప్లాస్టీ. ఇందులో భాగంగా, విరిగిన వెన్నెముక‌లోకి బోన్ సిమెంటును ఇంజెక్ట్ చేస్తారు. సాధార‌ణంగా కింద ప‌డిన‌ప్పుడు, లేదా ఆస్టియోపోరోసిస్ వ‌ల్ల ఇలా విరుగుతాయి. ఫ్రాక్చ‌ర్ అయిన ప్రాంతంలోకి ఇంజెక్ట్ చేసిన సిమెంటు గ‌ట్టిబ‌డి, అప్పుడు వెన్నెముక విరిగిన‌చోట అతుకుతుంది. సెంచురీ ఆస్ప‌త్రిలో ఇది స‌రికొత్త ప్రొసీజ‌ర్‌, ఈ కేసులో దీన్ని విజ‌య‌వంతంగా చేశారు.

ఈ ప్రొసీజ‌ర్ గురించి, పేషెంటు వివ‌రాల గురించి సెంచురీ ఆస్ప‌త్రి క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ కార్తీక్ మాట్లాడుతూ, “ఒక‌సారి కింద ప‌డిన త‌ర్వాత ఈ పేషెంటు తీవ్ర‌మైన వెన్ను నెప్పితో బాధ‌ప‌డుతున్నారు, చివ‌ర‌కు క‌ద‌లిక‌లు కూడా క‌ష్ట‌మ‌య్యాయి. దాంతో వెర్టెబ్రోప్లాస్టీ ద్వారా వెన్నెముక‌కు బయోమెకానిక‌ల్ స్థిర‌త్వాన్ని అందించాల‌ని నిర్ణ‌యించాం. దీన్ని మినిమ‌ల్లీ ఇన్వేజివ్ ప‌ద్ధ‌తిలో చేశాం. ఇందులో భాగంగా వెన్నెముక విరిగిన‌చోటుకు బోన్ సిమెంటును అత్యంత జాగ్ర‌త్త‌గా ఇంజెక్ట్ చేస్తాము. పేషెంటుకు నొప్పి వెంట‌నే త‌గ్గిపోయింది, ఇప్పుడు ఆమె త‌న రోజువారీ ప‌నులు చేసుకుంటున్నారు” అని చెప్పారు.

సెంచురీ ఆస్ప‌త్రి గురించి:
హైద‌రాబాద్ న‌డిబొడ్డున 220 ప‌డ‌క‌ల‌తో అత్యాధునిక సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిగా సెంచురీ ఆస్ప‌త్రి ఏర్పాటైంది. అగ్నిమాప‌క మార్గ‌ద‌ర్శ‌కాలు, ఎన్ఏబీహెచ్ ప్ర‌మాణాల ప్ర‌కారం నిర్మిత‌మైన ఏకైక ఆస్ప‌త్రి ఇదే. సెంచురీ ఆస్ప‌త్రి బృందంలో వైద్య‌నిపుణులు, న‌ర్సులు, ఫార్మ‌సిస్టులు, ఫిజియోథెర‌పిస్టులు, సోష‌ల్ వ‌ర్క‌ర్లు, వ‌లంటీర్ సేవ‌లు, స‌హాయ సిబ్బంది, వృద్ధుల చికిత్స నిపుణులు ఇలా ఎంద‌రో ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article