624 మంది వైద్యుల మరణం

100

రెండవ వేవ్‌లో COVID-19 కారణంగా మొత్తం 624 మంది వైద్యులు మరణించారు ఢిల్లీలో గరిష్టంగా 109 మరణాలు నమోదయ్యాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తెలిపింది. IMA ప్రకారం, మహమ్మారి యొక్క మొదటి తరంగంలో 748 మంది వైద్యులు మరణించారు. ఐఎంఏ జూన్ 2 దాకా నమోదు చేసిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో అత్యధికంగా 109 మంది వైద్యులు మరణించారు.0 బీహార్ 96, ఉత్తర ప్రదేశ్ 79, రాజస్థాన్ 43, జార్ఖండ్ 39, ఆంధ్రప్రదేశ్ 34, తెలంగాణ 32, గుజరాత్ 31, పశ్చిమ బెంగాల్ 30 మంది మరణించారు. గత సంవత్సరం, భారతదేశం అంతటా 748 మంది వైద్యులు కొవిడ్-19 కి బలయ్యారు. ప్రస్తుత రెండో వేవ్ లో స్వల్ప వ్యవధిలో 624 మంది వైద్యుల్ని కోల్పోయామ”ని ఐఎంఎ ప్రకటించింది. మరి, తెలంగాణలో 32 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ చెబుతుండగా.. మరి, వారి గురించి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here