చాలా అనుకున్నాం.. ఏమీ చేయలేదు

63 PERCENT PEOPLE AGAINST MODI

  • మోదీ పాలనపై ప్రబలుతున్న వ్యతిరేకత
  • ఆయన పాలన బాలేదని 63 శాతం మంది వెల్లడి

ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందా? ఆయన పాలనపై ప్రజల్లో ప్రతికూలత ప్రబలుతోందా? ప్రస్తుతం వచ్చిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. 63 శాతం మంది ప్రజలు మోదీ పాలన తాము ఆశించినట్టుగా లేదని అభిప్రాయపడ్డారు. మోదీ పాలన కాంగ్రెస్ కంటే భిన్నంగా ఉండి, అన్ని వర్గాల ప్రజలూ ఆనందంగా ఉంటారని భావించామని, కానీ అలాంటిది ఏమీ జరగేలేదని ఎక్కువమంది వెల్లడించారు. నోట్ల రద్దు, జీఎస్సీ వంటి అంశాలు మోదీపై ప్రజల్లో.. ముఖ్యంగా మధ్యతరగతి వర్గంలో వ్యతిరేకత పెంచాయి. వాస్తవానికి నోట్ల రద్దు అంశాన్ని తొలుత అందరూ స్వాగతించారు. దాని వల్ల నల్లధనం అంతా బయటకు వస్తుందని భావించారు. కానీ అలాంటిది ఏమీ జరగేలేదు. చాలామంది ప్రముఖులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తమ నోట్లను అక్రమ పద్ధతిలో మార్చుకున్నారు. అలాగే, నోట్ల రద్దు గురించి కొంతమంది పెద్దలకు ముందుగానే ఉప్పందడంతో వారంతా జాగ్రత్త పడ్డారనే ఆరోపణలొచ్చాయి.

ఈ క్రమంలో డబ్బుల కోసం పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏటీఎంల ముందు చాంతాడంత క్యూలు కట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితుల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో నోట్ల రద్దు ఒక ఫెయిల్యూర్ గా నిలిచిపోవడం మోదీకి ప్రతికూలతగా మారింది. అలాగే జీఎస్టీ కూడా ఆయనకు వ్యతిరేకతనే ఎక్కువ తీసుకొచ్చింది. జీఎస్టీ కారణంగా చిన్న వ్యాపారాలు దివాలా తీయడం ఆయా వర్గాల్లో మోదీ పాలనపై వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. ఈ అంశాలే తాజాగా చేసిన సర్వేలో ప్రతిబింబించాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కడం కష్టమనే విషయం ఇటీవలి సర్వేల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీపై వ్యతిరేకత పెరగడం కూడా కమలనాథుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article