ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగడుతున్న 70 ఏళ్ళ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి

70-year-old retired railway employee who raped two girls

వరంగల్, హైదరాబాద్ లలో చిన్నారులపై మానవ మృగాల అకృత్యాలు మరవక ముందే డోన్ పట్టణంలో 70 ఏళ్ల వృధ్దుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచార యత్నం చేశాడు.
డోన్ లోని రైల్వే త్రివర్ణ కాలనీలో రాందాస్ అనే 70 ఏళ్ళ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 7, 8 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాలికలపై గత రెండు రోజులుగా అత్యచారం చేస్తున్నాడు. కొత్తగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్ భవనంలోకి బాలికలను తీసుకువెళ్ళి ఈ దారుణానికి ఒడిగడుతున్నాడు. శనివారం నాడు కూడా బాలికలను రైల్వేకార్టర్సు నూతన భవనంలోకి తీసుకు వెళ్ళి అత్యాచారం చేస్తుండగా చిన్నారులు భయంతో కేకలు వేశారు. చిన్నారుల అరుపులు విన్న స్ధానికులు అక్కడకు చేరుకున్నారు. బాలికలు చెప్పిన సమాచారంతో ..అత్యాచారయత్నం చేసిన రాందాస్ కు దేహశుధ్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article