ప‌ల్లె ప్ర‌గ‌తి కోసం 7,435.48 కోట్ల విడుద‌ల

2018-19 నుండి సెప్టెంబర్ 2021 వరకు పల్లె ప్రగతి కొరకు కేంద్ర ఫైనాన్స్ నిధులతో సమానం రాష్ట్ర ఫైనాన్స్ నుండి మొత్తం 7 వేల 435 కోట్ల 48 లక్షలు విడుదల చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్ రావు వివరించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో గౌరవ సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పురాణం సతీశ్, భాను ప్రసాద రావు, బాలసాని లక్ష్మీనారాయణ, కల్వకుంట్ల కవిత, తేరా చిన్నప రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధాన మిచ్చారు. సీఎం కెసిఆర్ పాలన సంస్కరణలు తెచ్చారని, గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769 కి పెంచరాన్నారు. 3,146 తండాలను గ్రామ పంచాయతీలను చేసిన ఘనత కూడా మన సీఎం గారికి చెందుతుందన్నారు. పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలతో అభివృద్ధి మరింత విస్తృతమైన దని మంత్రి చెప్పారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో
ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం దేశంలో ఎక్కడలేని విధంగా 2019-20 నుండి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కి సమానంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ నిధులను జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు, మండల పరిషత్తులకు మరియు జిల్లా పరిషత్తులకు ఇస్తున్నాం. 2019-20 లో నెలకు 339 కోట్ల చొప్పున 2 వేల 373 కోట్లు విడుదల చేశాం. ఇందులో 1 వెయ్యి 570 కోట్ల 58 లక్షలు 14వ ఆర్థిక సంఘం నిధులు, 802 కోట్ల 42 లక్షలు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇచ్చామని మంత్రి తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ప్రభుత్వం 1 వెయ్యి 847 కోట్ల రూపాయలు మరియు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ 1 వెయ్యి 847 కోట్లు కేటాయించగా.. నెలకు 308 కోట్ల చొప్పున గ్రామపంచాయతీలకు కేటాయించాం. దీంతో చిన్న గ్రామపంచాయతీలకు కూడా 5 లక్షలకు తగ్గకుండా నిధులు ఇవ్వాలని, 2020-21 సంవత్సరంలో 63 లక్షలు 85 వేలు మరియు 2021-22 లో 2 కోట్ల 84 లక్షలు చిన్న గ్రామాలకు విడుదల చేశాం. అని మంత్రి సభకు వివరించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు 25 శాతం తగ్గించి కేవలం 1 వెయ్యి 365 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. దానికనుగుణంగా రాష్ట్రం కూడా 1 వెయ్యి 365 కోట్ల రూపాయలు కేటాయించింది. అని మంత్రి చెప్పారు. ఎప్రిల్ 2021 నుండి సెప్టెంబర్ 2021 వరకు ప్రతి నెల 227 కోట్ల 50 లక్షల రూపాయల చొప్పున 1 వెయ్యి 365 కోట్ల రూపాయలు గ్రామపంచాయతీలకు విడుదల చేశాం. జనాభా ఆధారంగా తలసరి గ్రాంటు విధానంలో ప్రభుత్వం నిధులను విడుదల చేసి, పంపిణీ చేయడం జరుగుతోంది. 2017-18 వ సంవత్సరము వరకు కొంత గ్రాంటును మండల, జిల్లా పరిషత్తులకు తలసరి వాటాగా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 10 శాతం అంటే దాదాపు 136 కోట్లు మండల పరిషత్తులకు, 5 శాతము అంటే 68 కోట్లు జిల్లా పరిషత్తులకు కూడా ఇవ్వడం జరుగుతోంది. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.

అంతేకాకుండా పాఠశాల్లల్లో మౌళిక సదుపాయాలకు మరియు సాధారణ పనులు చేపట్టడానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద 500 కోట్ల రూపాయలు జిల్లా ప్రజా పరిషత్తులకు మరియు మండల పరిషత్తులకు కేటాయించాం. ఇది మండల, జిల్లా పరిషత్తులకు అంతకుముందు కేటాయించబడిన నిధుల కంటే చాలా ఎక్కువ అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఇక ఉపాధి హామీ నిధుల కేటాయింపు వ్యవహారాల ను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తగు విధంగా నిర్ణయిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులకు వివరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article