ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్

#80 kgs plastic in Cow stomach#

ప్లాస్టిక్ వ్యర్థాలు మనవాళినే కాదు.. జంతజలాన్ని నాశనం చేస్తున్నాయి. విచ్చలవిడి ప్లాస్టిక్ వాడటం వల్ల టన్నులకొద్ది వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. మూగజీవాలైన పశువులు వాటిని తినేసి అనారోగ్యాల బారిన పడుతున్నాయి. కొన్నిచోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు తిని చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్ లో జరిగింది.

అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం హైదరాబాద్ అమీన్‌పూర్‌ గోశాలకు తరలించారు. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా.. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో పశువైద్యాధికారి ఆవుకు శస్త్ర చికిత్స చికిత్స చేయగా భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అవి ప్లాస్టిక్ వ్యర్థాలు తినడం, అవి పొట్టలోనే పేరుకుపోవడం జరిగింది. డాక్టర్ చికిత్స చేయగా 80 కిలోల ప్లాస్టిక్, కాటన్‌ బట్టలు బయట పడ్డాయి. చికిత్స అనంతరం ఆవు క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు డాక్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *