Tuesday, November 19, 2024

ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ

రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ
రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకులో ఘ‌ట‌న‌
గ్యాస్ కట్టర్‌తో కిటికీని కట్ చేసిన దొంగ‌లు

వరంగల్ జిల్లా రాయపర్తిలో భారీ చోరీ జరిగింది. ఎస్‌బీఐ బ్యాంకులో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణకు గురైంది. గతరాత్రి బ్యాంకు కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు లాకర్లలో దాచిన దాదాపు 10 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద చోరీ ఇదే కావటం గమనార్హం. ఎస్‌బీఐ బ్యాంకులోని లాకర్‌లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణకు గురైన‌ట్లు గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకులో ఈ భారీ దొంగతనం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగ‌ళ‌వారం ఉదయం 10 గంటలకు బ్యాంకు సిబ్బంది యథావిథిగా బ్యాంకుకు వెళ్లారు. అయితే బ్యాంకు షెట్టర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా.. వస్తువులు, ఫైల్స్ చిందర వందరగా పడి ఉన్నాయి. తీవ్ర భయాందోళనకు గురైన బ్యాంకు సిబ్బంది ఆలస్యం చేయకుండా పోలీసుల సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు వెనుక వైపున ఉన్న కిటికీని గ్యాస్ కట్టర్ సాయంతో తొలగించి లోపలికి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఊరు చివరన నిర్మానుష్య ప్రాంతంలో ఉండటంతో చోరీ చేయటం దుండగులకు సులభమైంది. బ్యాంకు లోపలికి చొరబడిన దొంగలు లాకర్లలో భద్రపరిచిన సుమారు 10 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. చోరీకి గురైన బంగారం విలువ దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా.
గతంలో కూడా ఓసారి ఇదే బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఈసారి మాత్రం మాత్రం పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మండల కేంద్రంలోని పలు సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన బంగారు ఆభరణాలు చోరికి గురయ్యాయన్న విషయం తెలుసుకున్న ఖాతాదారులు భారీగా బ్యాంకు వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
జనగామ జిల్లాలోనూ గతరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మారుజోడు రాంబాబు ఇంట్లో చోరీ చేశారు. ఇంట్లో టీవీతో పాటుగా విలువైన పత్రాలను దొంగిలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular