Three Year’s old boy died in apartment celler
భారీ వర్షాల కారణంగా సెల్లార్ లో మునిగి ఓ బాలుడు చనిపోయాడు. హైదరాబాద్ దిల్ సుక్ నగర్ సాహితీ అపార్ట్ మెంట్ సెల్లార్ పూర్తిగా నీటిమయమైంది. నిన్న కురిసిన భారీ వర్షానికి అపార్ట్ మెంట్ సెల్లర్ లోకి నీరు చేరింది. బుధవారం ఉదయం బాబు ఆడుకుంటూ కిందకు వెళ్లి నీటిలో పడ్డాడు.
బాబును గమనించి తండ్రి యుగేంద్రర్ సెల్లర్ లోకి వెళ్లాడు. అప్పటికే బాబు నీళ్లలో మునిగిన బాబును ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు బాబు చనిపోయాడని చెప్పారు. ఈ ప్రమాదం పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.