Sunday, April 20, 2025

కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపుపై సమగ్ర నివేదిక తయారు చేయాలి

నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుంది, నీటి లభ్యతపై పూర్తి అధ్యయనం చేయాలి
1వ తేదీ వరకు టెండర్లకు కార్యాచరణ రూపొందించాలి: అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్‌రెడ్డి

కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుంది, నీటి లభ్యతపై పూర్తి అధ్యయనం చేయాలని, రాబోయే డిసెంబర్ 1వ తేదీ వరకు టెండర్లకు కార్యాచరణ రూపొందించాలని సిఎం రేవంత్ ఆదేశించారు. నగర ప్రజల తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగం పెంచింది. ఈ నేపథ్యంలోనే శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టిఎంసీల గోదావరి జలాల తరలింపుపై సిఎం సమీక్షించారు.

మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సిఎం రేవంత్ సూచించారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, జలమండలి ఎండి అశోక్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జె.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మూసీ ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పునరుజ్జీవనం చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ మేరకు నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి మంచినీటి సరఫరా ఫేజ్-2కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయిస్తూ ఇందుకోసం రూ. 5,560 కోట్లను పురపాలక శాఖ ఇప్పటికే జీవో నంబర్ 345 ను జారీ చేసిన సంగతి తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com