Sunday, September 29, 2024

మనిషి మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన బ్యాక్టీరియీ

సోకిన రెండు రోజుల్లోనే ప్రాణాలు తీసేంత డెంజరస్

మీరు చాలా రకాల బ్యాక్టీరియా గురించి విని ఉంటారు. కానీ ఏకంగా మనిషి ప్రాణాలు తీసే బ్యాక్టీరియా గురించి వింటే మాత్రం ఒళ్లు గగుర్పాటుకు గురవ్వక తప్పదు. అవును మనిషిని చంపేసే అత్యంత ప్రమాదకరమైన ఓ బ్యాక్టీరియా జపాన్‌ ను నిలువునా వణికిస్తోంది. మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్‌ లోని టోక్యో నగరంలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ బ్యాక్టీరియాను శాస్త్రీయంగా స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) గా పిలుస్తున్నారు వైద్య రంగ నిపుణులు. ఈ బ్యాక్టీరియా ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కంటే కూడా ప్రమాదకరమైందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ అతలాకుతలం అవుతోంది.

మనిషి మాంసాన్ని తిని బతికే ఈ డెంజరస్ బ్యాక్టీరియా కేసులు జపాన్‌ లో అంతకంతకు పెరిగిపోతున్నాయి. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ డీసీజెస్ ప్రకారం.. జూన్ 2 నాటికి ఈ బ్యాక్టీరియాకు సంబందించిన 977 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో టోక్యోలోనే 145 కేసులు నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. ఈ బ్యాక్టీరియా బారినపడ్డవారిలో ముందు అతి సాధారణమైన లక్షణాలే కనిపిస్తాయట. సాధారణంగా గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలతో ప్రారంభమై.. క్రమంగా శరీరంలోని అవయవాల నొప్పి, వాపు, జ్వరం, లో బీపీ, శరీర కణజాలాన్ని చంపేసే నెక్రోసిస్ వంటి తీవ్రమైన లక్షాణాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ బ్యాక్టీరియాకు సంబందించిన లక్షణాలు మెల్ల మెల్లగా పెరిగి చివరికి శరీరంలోని అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీస్తుందట. ఇఖ ఈ వ్యాధి కేసులు 30 ఏళ్లు పైబడినవారిలో అత్యధికంగా నమోదు అవుతుండగా, 50 ఏళ్లు పైబడినవారికి ప్రమాదకరంగా మారుతోందని గుర్తించారు. అంతే కాదు లక్షణాల తీవ్రతను బట్టి ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు కేవలం 48 గంటల్లోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ బ్యాక్టీరియా బారిన పడ్డ రోగికి ఉదయం పాదంలో వాపు గమనిస్తే.. మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించి, ఆ తరువాత 48 గంటల్లోనే చనిపోవచ్చని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కికుచి తెలిపారు.

ఇక ఈ ప్రాణాంతకమైన బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని, మెల్లగా మలం ద్వారా వారి వారి చేతులను కలుషితం చేస్తుందని నిపుణులు గుర్తించారు. అందుకే చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఒంటిపై గాయాలు ఉన్నవారు వెంటనే చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular