తెలంగాణలో వజ్రాల అనవాళ్లు

A Farmer found Daimond

వరి, ఇతర పంటలు దండిగా పండే భూమిని మన రైతులు ‘బంగారం లాంటి భూమి’ అంటుంటారు. బంగారం సంగతేమోకానీ.. వజ్రాలు దొరికితే ఆ భూమిని ఏమనాలి. వ్యవసాయ పొలంలో వజ్రాలా… అని ఆశ్యర్యపోకండి. మీరు చదివేది నిజమే. ఓ రైతు పొలంలో వజ్రం దొరికింది. ఏ రాష్ర్టంలోనో కాదు. మన దగ్గరే. రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ మండలానికి చెందిన ఓ రైతు పొలంలో పెద్ద వజ్రం దొరికింది. నిజమైన వజ్రమో కాదో అని తెలుసుకునేందుకు రహస్యంగా ల్యాబ్ టెస్టులు కూడా చేశాడు. టెస్టుల్లో వజ్రమే అని స్పష్టమైంది. అక్కడితో ఆగకుండా వజ్ర నిక్షేపాలను అధ్యయనం చేసేవాళ్లను సంప్రదించాడు. వాళ్లు కూడా వజ్రమే అని తేలడంతో రైతు ఆశ్యర్యపోయాడు. ఈ విషయం బయటకు చెప్పొద్దని కళ్ళావెళ్లా పడ్డాడు. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాలుగు శతాబ్దాల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు దొరకడంతో జీఎస్‌ఐ ఆధ్వర్యంలో పదేళ్ల పాటు పాటు సర్వే చేశారు. ఈ సర్వేలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారానికి సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయని తేలింది. ఆయా జిల్లాల్లో ఏఏ ప్రాంతాల్లో  ఉన్నాయో మ్యాపులు సైతం ఖరారు చేశారు. దీనిపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన జియో ఫిజిక్స్‌ విభాగం ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. గతంలో మైనింగ్ అధికారులు చేసిన సర్వేలో బంగారం, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఈ వజ్రాల సంగతిపై రాష్ర్టం, కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *