ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలి

వేములవాడ నియోజకవర్గానికి చెందిన కథలాపుర్ సర్పంచులు ఎంపీటీసీలు ఈ రోజు మంత్రి కే తారకరామారావుని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజ్ఞప్తులను మంత్రి కేటీఆర్ కి అందించారు. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సూచన మేరకు కథలాపూర్ నియోజకవర్గంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ని కోరారు. కథలాపూర్ మండలం గంభీర్పూర్ లొ 433 ఎకరాల లొ మామిడి, పసుపు స్పెషల్ ఫూడ్ ప్రాసెసింగ్ జోన్ ఎర్పాటు చేయాలని మంత్రికి ఈ సందర్భంగా ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా అందుబాటులో ఉన్న మామిడి పసుపు పంటలకు సంబంధించి రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. జగిత్యాలలొ 36 వేల ఎకరాలలొ మామిడి తెలంగాణలొనే మొదటి స్థానం, పసుపు 22 వేల ఎకరాలలొ రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు ప్రధాన పంటల ప్రాసెసింగు, శుధ్ధి, మన ప్రాంతం లోనే జరిగితే రైతులకు గిట్టుబాటు, వ్యవాసాయాదాయానికి భరోసా మరియు వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తెలిపారు. ప్రైవేటు, సహకార రంగాలలొ ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రాయితీలు, మౌలికవసతుల కల్పనకోసం ప్రకటించిన స్పెషల్ ఫూడ్ ప్రాసెసింగ్ జోన్ ను ఏర్పాటు చేసేందుకు కథలాపూర్ మండలం లోని గంభీర్పుర్ గ్రామంలొని 433 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు.  ఈ ప్రతిపాదన గురించి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు పైన ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని స్థానిక ప్రజా ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article