పాక్ చెర నుండి విముక్తి…కలిసిన సీఎం జగన్

147
A.P fishermen freed by Pakistan meet Jagan
A.P fishermen freed by Pakistan meet Jagan
A.P fishermen freed by Pakistan meet Jagan
పాక్‌ జైలు నుంచి విడుదలైన మత్స్యకారులను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలుసుకున్నారు. 14 నెలలపాటు పాక్‌ జైల్లో చిక్కుకున్న మత్స్యకారులు 20 మందిని పాక్  చెర నుండి విడిపించారు. మరో ఇద్దరినీ కూడా త్వరలోనే బయటకు తీసుకువస్తామని చెప్తోంది వైసీపీ ప్రభుత్వం. నేడు వారిని కలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాక్‌ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని వారిని అడిగి తెలుసుకున్నారు. పోర్టు అనేది లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లాల్సి వస్తోందన్న మత్స్యకారులు
మాకు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటామని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళారు.
2018 నవంబరులో చేపల వేటకు వెళ్లి పాకిస్ధాన్‌ తీర జలాల్లో యాధృచ్చికంగా ప్రవేశించిన 22 మంది మత్స్యకారులను పాక్‌ కోస్ట్‌ గార్డు దళం అదుపులోకి తీసు కుంది. ఇక అప్పటి నుండి వారు అక్కడ జిల్లాలో మగ్గుతున్నారు. అరెస్టు అయిన 22 మంది మత్స్యకారుల్లో 15 మంది శ్రీకాకుళం, 5గురు విజయనగరం జిల్లా, 2 తూర్పు గోదావరి జిల్లా వాసులు. గుజరాత్‌కు చెందిన చేపలబోట్లలో పనికి వెళ్లి పాకిస్తాన్‌ కోస్ట్‌గార్డు దళాలకు ఈ మత్స్యకారులు చిక్కినట్టు తెలుస్తుంది. జాలర్లు పాకిస్తాన్‌ అదుపులో ఉన్న విషయాన్ని ధృవీకరించుకున్న అనంతరం వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిం చింది  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. భారత ప్రభుత్వ విదేశాంగశాఖ, మరియు  ప్రధానమంత్రి కి  పలు మార్లు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వారికి పాక్  చెర నుండి విముక్తి కల్పించింది.

నిర్భందంలో ఉన్న మత్స్యకారుల విడుదల అయ్యేవరకు వారి కుటుంబాల ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం మత్స్యకారుల  కుటుంబానికి నెలకు రూ.4500 చొప్పున ఫెన్షన్‌ మంజూరు ఇచ్చింది .  ప్రతి కుటుంబానికి 75శాతం సబ్సిడీపై వలలు, బోట్లు మంజూరు చేసింది. ఇక విడుదలైన మత్స్యకారులు ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. బతికినంత వరకూ మీ పేరు చెప్పుకుంటామని చెప్పిన వారు మీలో ఏదో కనిపించని శక్తి  ఉందని, అందుకనే మేం బయటకు రాగలిగామని వారు జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ సీఎం జగన్  చెక్కులు పంపిణీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here