ఓరి.. నీ మాస్కు బంగారంకానూ…

38
A Passanger sumgling gold in Mask
A Passanger sumgling gold in Mask

A Passanger sumgling gold in Mask

అక్రమ రవాణాలో బంగారం ఎప్పూడు ముందుంటోంది. అందుకే ఎవరికితోచినట్టుగా వారు గప్ చుప్ గా అక్రమ రవాణా చేస్తుంటారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కొ విధమైన పద్ధతిని ఎంచుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం బంగారం తరలించిన తీరే వేరు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ మాస్కులు ధరిస్తున్నారు. మాస్కులనే అదునుగా చేసుకొని ఓ ప్రయాణికుడు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయారు. కేరళలోని ఎన్ -95 మాస్కులో రూ. 2 లక్షల విలువైన 40 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన విమాన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సంఘటన కోజికోడ్ కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. కాలికట్ విమానాశ్రయానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ప్రభుత్వాలు అన్ని విధాలుగా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ  కొంత మంది అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తునే ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here