నకిలీ ఎస్ఐపై కేసు నమోదు

53
A SI Get job with fake certifactes
A SI Get job with fake certifactes

A SI Get job with fake certifactes

నకిలీ ధ్రువపత్రాలతో పోలీసు శాఖలో ఉద్యోగం పొందిన ఎస్ఐ పై కేసు నమోదైంది. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అటాచ్మెంట్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న గోగిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఏలూరు రేంజి అధికారులు కేసు నమోదు చేశారు. తొలుత అగ్నిమాపక శాఖలో పనిచేసిన ప్రభాకర్ రెడ్డి 2011 ఎస్ఐ రిక్రూట్మెంట్ లో పాల్గొని అర్హత సాధించారు. అనంతరం తన ధ్రువపత్రాలను ఏలూరు రేంజి ఐజీ కార్యాలయంలో అందజేశారు. రిక్రూట్మెంట్ సమయానికి రెండేళ్లు వయస్సు అధికంగా ఉన్న ప్రభాకర్ రెడ్డి, తాను ఎన్సీసీలో ఇన్స్ట్రక్షన్ గా పనిచేసినట్టు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిం చారు. ఎన్సీసీ ఇన్స్పెక్టర్ కు మూడేళ్ల వయసు సడలింపు అవకాశముంటుంది. తద్వారా 2014లో ఎస్ఐ గా పోస్టింగ్ సాధించారు. తొలి నుంచి వివాదాస్పదుడిగా పేరున్న ప్రభాకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా కొమరోలులో పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఎంపీడీఓతో గొడవ జరిగింది. ఎస్ఐ తీరుపై అనుమానం వచ్చిన ఎంపీడీవో గుంటూరు రేంజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసు ఉన్న తాధికారులు మార్కాపురం డీఎస్పీకి విషయం విచారించాలని అప్పజెప్పారు. ఈ క్రమంలో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన విషయం వాస్త వమేనని విచారణలో వెల్లడైనట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here