* రష్యాలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం
* మాస్కోలోని ఓస్టాంకినో టవర్ పై భారత త్రివర్ణ పతాకం
ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. రెండి రోజుల పర్యటన కోసం సోమవారం సాయంత్రం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు మోదీ. మోడీకి రష్యాలో ఘన స్వాగతం లభించింది. మాస్కోలో ల్యాండ్ అయిన ప్రధాని మోడీకి ముందు రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాగానే భారతీయులతో పాటు రష్యన్ డ్యాన్స్ ట్రూప్స్ సాంస్కృతిక నృత్యాలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. రష్యన్ అమ్మాయిల బృందం రాజస్థానీ పాట రంగిలో మారో ఢోల్నాకు డ్యాన్స్ చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులు వేసుకుని అదిరిపోయేలా డ్యాన్స్ చేసిన రష్యన్ యువతులు మోదీ సహా అందరిని ఆకట్టుకున్నారు.
ప్రధాని మోదీ రష్యా పర్యటన సందర్బంగా ఐరోపాలోనే ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ నిర్మాణం అయిన మాస్కో లోని ఓస్టాంకినో టవర్ ను భారత త్రివర్ణ పతాకంతో వెలిగిపోయింది. రెండేళ్ల క్రితం 2022 ఫ్రిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోడీ రష్యాకు వెళ్లడం ఇదే మొదటిసారి. 2019లో మోదీ రష్యాలో పర్యటించారు. ఇక రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం భారత ప్రధాని మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. జూన్ 9న క్రెమ్లిన్ లోని తెలియని సైనికుడి సమాధి వద్ద ప్రధాని పుష్పగుచ్ఛం ఉంచి శ్రధ్దాంజలి ఘటించనున్నారు. రష్యాలోని భారతీయ ప్రవాసులతో ముఖాముఖిలో పాల్గొంటారు.