వరంగల్: సికింద్రాబాద్ ఘటన లో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేసాడు. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికికు చెందిన గోవింద్ అజయ్ (20) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసాడు. సికింద్రాబాద్ స్టేషన్ అల్లర్ల సమయంలో ఒక టీవీ ఛానల్ లో అజయ్ మాట్లాడాడు. తన మీద పోలీసులు కేస్ నమోదు చేస్తారేమో అని భయంతో ఆత్మ హత్య యత్నం చేసినట్లు సమాచారం. అజయ్ ను వరంగల్ నగరంలోని నీహారీ ఆస్పత్రికి తరలించారు. అజయ్ పరిస్థితి నిలకడవుందని వైద్యులు అంటున్నారు.