ఆచార్య విషయంలో అదే నిజమా..?

38
Happy Birthday Chiru
Happy Birthday Chiru

aacharya update

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రను రామ్ చరణ్ చేస్తున్నాడు. ఈ నెల 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆ రోజున మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు కంప్లీట్ టైటిల్ లోగోను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన స్టిల్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ఇప్పటి వరకూ అంతా ఈ మూవీ గురించి అనుకుంటోన్న దానికి దగ్గరగా ఉండటం విశేషం. ముందు నుంచీ ఈ మూవీ విషయంలో వినిపిస్తోన్న విషయం సినిమాలో చిరంజీవి జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ పోస్టర్ లో కూడా అదే కనిపిస్తోంది. పిడికిలి ఎత్తి ఓ ఎర్ర కండువాను పట్టుకున్న వ్యక్తి ఉన్నాడు. అలా అర చేయి నుంచి కిందకి వెళుతుండగా ఆ ఎర్ర కండువాపై సూర్య కిరణాలు పడటం.. తర్వాత అది కాషాయ రంగులోకి  మారినట్టుగా కనిపించడం చూస్తోంటే ఈ నక్సలైట్ తర్వాత భక్తుడుగా మారతాడని తెలుస్తోంది. అంటే నక్సలైట్ మారిన తర్వాత దేవాలయ భూముల కోసం పోరాటం చేస్తాడు అని రూమర్స్ వచ్చాయి కదా. ఇది చూస్తోంటే అది నిజమే అనిపిస్తోంది. అంటే ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య పూర్తి కాంట్రాస్ట్ ఉంటుంది. ఒక రకంగా కొరటాల శివలో ఆధ్యాత్మిక పాళ్లు ఎక్కువ. దాన్ని ఎలివేట్ చేయడానికో లేక.. అదే నిజం.. ఎర్రజెండాలు కాదు అని చెప్పడానికో ఈ సినిమా చేస్తున్నారా అనే అనుమానమూ వస్తోంది. ఏదేమైనా ఈ నెల 22న ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేస్తాం అని ఆ పోస్టర్ తో అనౌన్స్ చేసింది టీమ్.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here