ఆసా ఫౌండేషన్ అదుర్స్

45
AASA FOUNDATION GOOD WORK
AASA FOUNDATION GOOD WORK

AASA FOUNDATION GOOD WORK

కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న కొలది లాక్‌డౌన్‌ మరింత కఠినతరంగా అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఐతే దీని ప్రభావం రోజు వారి కూలీ నాలీ చేసుకునే వారిపై పడుతోంది. వీరికి స్వచ్చంద సంస్ధలు ముందుకు వచ్చి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా, ఆసా ఫౌండేషన్ నిరుపేదలకు, ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు తమవంతు సహాయాన్ని అందజేస్తూ శభాష్ అనిపించుకుంటుంది.

హైదరాబాద్‌కు చెందిన ఆసా ఫౌండేషన్‌ కూకట్‌ పల్లిలో రోడ్‌ నెంబర్‌ -1 లోని పారిశుధ్య కార్మికులతోపాటు కూలీ చేసుకుని పొట్టపోసుకునే వారికి నిత్యావసరాలను అందచేసింది. అమెరికాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ దాతల ద్వారా దాదాపుగా 50 వేల విలువైన నిత్యవసర సరుకులను పంపిణీ చేసింది. దాదాపుగా 70 మంది కుటుంబాలకు నిత్యావసర కిట్స్‌ను అందచేసింది. ఒక్కో కిట్‌లో బియ్యం, పప్పు, నూనె, పసుపు, ఉల్లి, కారంతో పాటు పేస్ట్‌ వైరస్‌ భారి నుంచి కాపాడుకునేందుకు కావాల్సిన మాస్క్‌,సానిటైజర్స్‌ను సైతం ఆస ఫౌండేషన్‌ అందించిందని ఫౌండర్‌ ఆకుల సోనియా తెలిపారు. లాక్‌డౌన్‌ తరువాత రోడ్లపై తిండిలేక అలమటిస్తున్న వారికి భోజనం కూడా పంపిణి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం ఈ సేవా కార్యక్రమాలు చేస్తామని ఆమె తెలియచేశారు.ఈ సమయంలో ఎవరైన దాతలు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తే కూడా వారితో కలిసి పనిచేసేందుకు సిద్దమని ఆసా ఫౌండేషన్‌ నిర్వాహకురాలైన సోనియా తెలియచేశారు.

TELANGANA BEST NGO’S 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here