వైఎస్సార్ సీపీలోకి అబ్దుల్ గఫూర్

Abdhu Gapur Joining to YSR CP

  • జగన్ సమక్షంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఆ పార్టీలోకి చేరికలు మళ్లీ మొదలయ్యాయి. జగన్ యాత్రకు వచ్చిన స్పందన.. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయనే సమీకరణాల నేపథ్యంలో పలువురు నేతలు జగన్ వైపు చూస్తున్నారు. తాజాగా ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నేత అబ్దుల్‌ గఫూర్‌ శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పులివెందులలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గఫూర్‌, ఆయన అనుచరులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి.. వైఎస్‌ జగన్‌ వారిని సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article