కేంద్రం కోర్టులో శాసనమండలి రద్దు

151
Abolish Legislative Council Bill Passed To Central
Abolish Legislative Council Bill Passed To Central

Abolish Legislative Council Bill Passed To Central

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మండలి రద్దు తీర్మానానికి 133 మంది సభ్యులు మద్దతు పలికారు. వ్యతిరేక, తటస్థ ఓట్లు లేకుండా మండలి రద్దు తీర్మానానికి ఆమోదం వచ్చింది. మండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ కేంద్రానికి పంపనుంది.  అయితే పార్లమెంట్‌ ఆమోదం… రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ శాసనమండలి రద్దు కానుంది. మొదటగా రద్దు బిల్లును కేంద్ర హోం శాఖకు పంపుతారు. ఆ తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. పార్లమెంట్‌తో పాటు రాజ్యసభ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఉభయ సభల నిర్ణయాన్ని బిల్లు రూపంలో రాష్ట్రపతికి పంపుతారు. ఇక్కడ రాష్ట్రపతి నిర్ణయం కీలకం కానుంది. ఆయన కూడా బిల్లుపై సంతకం చేస్తే అప్పుడు శాసనమండలి రద్దు అవుతుంది. అయితే ఈ పక్రియ అంతా అనుకున్నట్లు జరిగితే కనీసం మూడు నెలలు లేదా ఏడాది సమయం పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే ఏపీ రాజధాని విషయంలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందని కారణంగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి మండలిని రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఏపీలో బలమైన పార్టీగా ఎదగాలని చూస్తోంది. ఈ క్రమంలో రాజధాని తరలింపు బీజేపీకి మంచి అవకాశం కల్పించింది. రాజధానిని తరలించడాన్ని జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది . ఇప్పుడు ఈ రెండు పార్టీలు సంయుక్తంగా రాజధానిని తరలించడంపై వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాయి. ఈ తరుణంలో శాసనమండలి రద్దుకు కేంద్రం సమ్మతి తెలుపుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొంతకాలం క్రితం వరకు వైసీపీ, బీజేపీ మధ్య సఖ్యత ఉన్నా.. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లేవు. ఈ నేపథ్యంలో జగన్ ఒత్తిడి మోదీపై పనిచేయకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్రం వైఖరి తెలియాల్సిన అవసరం ఉంది .

Abolish Legislative Council Bill Passed To Central,legislative council , repeal,  ap assembly, resolution , parliament , central government , president, ycp government , bjp, ycp, janasena, tdp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here